Share News

Tiger Tension: పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..

ABN , Publish Date - Dec 03 , 2024 | 09:01 AM

కొమురం భీం జిల్లా: పులి జాడ కోసం కాగజ్ నగర్ అడవుల్లో అన్వేషణ కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు నిర్దారించారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా సెర్చింగ్ చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పులి ప్రభావిత గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Tiger Tension: పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..

కొమురంభీం జిల్లా: అడవుల్లో పులి (Tiger) సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై పులి దాడి చేసింది. దీంతో భయంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు (Farmers) భయపడుతున్నారు. ఇటిక్యాల్, పహాడ్, దుబ్బగూడ శివారు ప్రాంతాలవైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్దపులి సంచారంతో పశువులు సయితం దొడ్లకే పరిమితం అవుతున్నాయి. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒకవైపు డ్రోన్లు, మరోవైపు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేనికీ ఇప్పటి వరకు పులి ఫోటోలు చిక్కలేదు. కేవలం పులి పాదముద్రలు మాత్రమే అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి ఫోటో చిక్కితే దాని చారలను బట్టి అది ఏ పులి.. దాని పేరేంటి అన్నది తెలుసుకునే అవకాశముందని అటవీశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇంతకీ పులి ఆడదా. మగదా.. దాని పేరు తెలిస్తే పులి ప్రవర్తన ఏంటో అంచనా వేసే అవకాశముందని.. ఒక వేళ అక్కడ దాడి చేసి పులి మహారాష్ట్రలో సయితం మనుషులపై దాడి చేసేందేనని నిర్ణారణ అయితే మాత్రం దాన్ని పటటుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఆత్మ రక్షణ కోసం దాడి చేసిందా.. గతంలో పులి చరిత్ర ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మత్తు ఇచ్చి పంపిస్తామని అటవీ అధికారులు అంటున్నారు.


కాగా పులి జాడ (Tiger Tracks) కోసం కాగజ్ నగర్ అడవుల్లో (Kagaznagar forests) అన్వేషణ (Search) కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు (Forest Officers) నిర్దారించారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా సెర్చింగ్ చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పులి ప్రభావిత గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేశారు. రైతులు, కార్మికులను పంట చేలకు, అటవీ మార్గాల్లోకి అధికారులు వెళ్ళ నీయడంలేదు. పులి నుంచి కాపాడేందుకు మాస్కులు పంపిణీ చేశారు.

పెద్దపులి టెన్షన్

కాగా కొమురం భీం జిల్లాలో పెద్దపులి టెన్షన్ (Big Tiger Tension) కొనసాగుతోంది. రెండు రోజుల్లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసింది. మహిళను (Women) చంపింది. రైతు (Farmer)పై దాడి చేసింది. ఈ ఇద్దరిపై దాడి చేసింది ఒకే పులి అని నిర్దారణ అయింది. అటు పులి కదలికలను గుర్తించడంలో అటవిశాఖ విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపులి విషయంలో తమను అప్రమత్తం చేయలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాడి జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేస్తున్నారని అంటున్నారు. అయితే తాము అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పెద్దపులి కదలికల నేపథ్యంలో కాగజ్‌నగర్, సర్పూర్ టీ మండలాల్లోని 15 గ్రామాల్లో (15 Villages) 144 సెక్షన్ (144 Section) కొనసాగుతోంది. అభరాణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి. గ్రామల పొలిమేరలోకి వచ్చి వరుస దాడులు చేస్తూ.. మూగజీవాలు, మనుషులను హతమారుస్తున్నాయి. పులిదాడిలో వ్యవసాయ కూలీ మరణించగా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది.

జిల్లాలో పెద్దపులి మరోసారి దాడి చేసింది. సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. రైతు సురేశ్ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల రైతులు అప్రమత్తమయ్యారు. అంతా కలిసి గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. పులి దాడిలో సురేశ్‌ మెడకు తీవ్రగాయాలు కాగా.. తోటి రైతులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఓ మహిళపై దాడి చేసి చంపిన 24 గంటల వ్యవధిలోనే మరో దాడి జరగడంతో జిల్లావాసులు పులి భయంతో వణికిపోతున్నారు.


కాగా మనుషుల రక్తం మరిగిన పెద్దపులి శుక్రవారం నాడు కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో వ్యవసాయ పనులకు వెళ్లిన మోహిర్లె లక్ష్మి అనే యువతిపై దాడి చేసి చంపేసింది. గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి తోటి మహిళలతో కలిసి పత్తి చేలో పని చేసేందుకు శుక్రవారం ఉదయం నజ్రూల్ నగర్ గ్రామానికి వెళ్లింది. అయితే పత్తి ఏరుతుండగా అక్కడే మాటు వేసిన పులి ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. మెడ భాగాన్ని కరవడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. దాడిని గమనించిన తోటి కూలీలు కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. బాధితురాలిని గ్రామస్థులంతా కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకుని అటవీ శాఖ కార్యాలయం ఎదుట కుటుంబసభ్యులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. అయితే పులి దాడిలో యువతి మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం..

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

అమరావతి 2.0 పనులు పరుగు

తమిళనాట ఆగని విధ్వంసం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 03 , 2024 | 09:01 AM