Share News

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:49 PM

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూటీఎస్‌తోనే కృషి చేస్తోం దని సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నా రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా బుధ వారం దండేపల్లి, లింగాపూర్‌తోపాటు పలు పాఠ శాలల ఉపాధ్యాయులు సభ్యత్వం స్వీకరించారు.

 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

దండేపల్లి,జూలై 24: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూటీఎస్‌తోనే కృషి చేస్తోం దని సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నా రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా బుధ వారం దండేపల్లి, లింగాపూర్‌తోపాటు పలు పాఠ శాలల ఉపాధ్యాయులు సభ్యత్వం స్వీకరించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల స మస్యల పరిష్కరంతోపాటు ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సాధించడం సంఘ లక్ష్యమన్నారు. అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు ఎంఈవో, డీఈవో, జూనియర్‌ లెక్చరర్‌, డైట్‌ లెక్చరర్‌ వంటి పోస్టులు, పదోన్నతి ద్వారా పొందడానికి అవకాశం ఉంద న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సంఘం రాష్ట్ర నాయకులు సమస్యలను తీసుకువెళ్ళారన్నారు. ఎస్టీటి ఉపాధ్యాయులను రీలీవ్‌ చేయించడానికి ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కోర్టు కేసులో ఆగిపోయిన మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల బదిలీలు త్వరలోనే జరుగుతాయ న్నారు. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్క రించే విధంగా కృషి చేస్తామన్నారు. మండల అధ్యక్షకార్యదర్శు రావన వేని రవి, మల్యాల మల్లేష్‌, సంఘం నాయకులు జనార్దన్‌, అప్పాల మనోహర్‌, నాగవర్మ, పాత రమేష్‌, వరలక్ష్మి, రమేష్‌, రాజు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 10:49 PM