Share News

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:57 PM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజున ప్రజలకు అసౌకర్యం కలగకుండా కేంద్రా లను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ పేర్కొన్నారు. గురువారం ప్రజల సౌకర్యార్ధం చేపడు తున్న పోలింగ్‌ కేంద్రాల మార్పు ప్రక్రియను పరిశీ లించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

బెల్లంపల్లి, ఏప్రిల్‌ 18: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజున ప్రజలకు అసౌకర్యం కలగకుండా కేంద్రా లను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ పేర్కొన్నారు. గురువారం ప్రజల సౌకర్యార్ధం చేపడు తున్న పోలింగ్‌ కేంద్రాల మార్పు ప్రక్రియను పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి మం డలంలోని 96 పోలింగ్‌ కేంద్రాన్ని కాళోజీశాఖ గ్రం థాలయం నుంచి భవిత డిగ్రీ కళాశాలకు, ఆకెన పల్లిలోని 36 పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి నేతకానివాడలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు మార్చామని తెలి పారు. అర్హులైన ప్రతీ ఒక్కరు మే 13వ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కేం ద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, నీడ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.

తాండూర్‌: పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలకు సౌక ర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ పేర్కొన్నారు. తాండూర్‌ మండలం లో పోలింగ్‌ కేంద్రాల మార్పు ప్రక్రి యను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ మండలంలోని 128, 129 పోలింగ్‌ కేంద్రాలను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి కిష్టంపేటలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలకు, 136 పోలింగ్‌ కేం ద్రాన్ని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాజీవ్‌నగర్‌ గ్రామ పంచాయతీ కార్యాల యానికి మార్చామని తెలిపారు. తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 10:57 PM