రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ABN , Publish Date - Jan 23 , 2024 | 09:47 PM
ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని ఆర్టీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగం గా మంగళవారం భీమారం బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
భీమారం, జనవరి 23: ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని ఆర్టీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగం గా మంగళవారం భీమారం బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. మద్యం తాగి, అతి వేగంగా వాహ నాలు నడపవద్దన్నారు. అలాగే ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి నడపాలని, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు.