Share News

వన్యప్రాణుల కోసం పచ్చిక మైదానాలు

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:48 PM

అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణుల కోసం గడ్డి జాతులను విస్తరించడానికి పచ్చిక మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని అట వీ అభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ శ్రీశ్రావణి పేర్కొన్నారు.

వన్యప్రాణుల కోసం పచ్చిక మైదానాలు

చెన్నూరు, జూన్‌ 22: అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణుల కోసం గడ్డి జాతులను విస్తరించడానికి పచ్చిక మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని అట వీ అభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ శ్రీశ్రావణి పేర్కొన్నారు. ఏరువాక పౌర్ణమి, ప్రపంచ రైన్‌ ఫారె స్టు డేను పురస్కరించుకుని అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటపల్లి మండలం బావనపల్లి నీల గిరి ప్లాంటేష న్‌ల మధ్యలో గడ్డి జాతి గింజ లను చల్లారు. ఆమె మాట్లాడు తూ పచ్చిక కొర వడడంతో కుం దేళ్లు, జింకలు అంతరిస్తున్నా యన్నారు. అట వీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పచ్చిక మైదానా లను పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ రేంజ్‌ల ఫ్లాం టేషన్‌ల మేనేజర్లు సురేష్‌కుమార్‌, లక్ష్మణ్‌, సునీత, డిప్యూటీ ప్లాంటేషన్‌ మేనేజర్‌లు రాకేష్‌, నరేష్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి ఝాన్సీలక్ష్మీ, ఫీల్డ్‌ సూపర్‌ వైజర్‌ శ్రీనివాస్‌, రాజేష్‌, వాచర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 10:48 PM