Share News

కల్యాణం.. కమనీయం...

ABN , Publish Date - Feb 21 , 2024 | 10:42 PM

గూడెం రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం సత్యదేవున్ని కల్యాణం కన్నుల పండు వగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాలు, అశేష భక్తుల మధ్య వైభవంగా నిర్వహించారు. గుట్ట కింద నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని సన్నాయి వాయి ద్యాలతో ప్రధానాలయం వరకు తీసుకవచ్చి అర్చ కులు, వేద పండితులు పూజలు చేశారు.

కల్యాణం.. కమనీయం...

దండేపల్లి, ఫిబ్రవరి 21: గూడెం రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం సత్యదేవున్ని కల్యాణం కన్నుల పండు వగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాలు, అశేష భక్తుల మధ్య వైభవంగా నిర్వహించారు. గుట్ట కింద నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని సన్నాయి వాయి ద్యాలతో ప్రధానాలయం వరకు తీసుకవచ్చి అర్చ కులు, వేద పండితులు పూజలు చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సతీమణి సురేఖ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ముఖ్య అర్చకులు రఘస్వామి, ఈవో శ్రీనివాస్‌, భక్తులు స్వామి వారికి పట్టువస్త్రాలు మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు సమర్పిం చారు. అనంతరం కల్యాణ వేదికపై సత్యదేవున్ని విగ్రహాలను ప్రతిప్ఠిం చారు. వేదపండితులు అభిరామచార్యులు, ఆలయ ముఖ్య అర్చకులు గోవర్ధన రఘ స్వామి, అర్చకులు సంపత్‌స్వామి, వేదపండితులు దుద్దిళ్ల నారాయణ శర్మ ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయబద్దంగా స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయప్రాంగణం మార్మోగింది. వేడు కల్లో మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఎం పీపీ గడ్డం శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘ నాథ్‌, ఎంపీటీసీలు మోహన్‌, కమలాకర్‌, రేనవేషన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

సత్యనారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సత్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం, విశ్వక్సేనాధారణ, అంకురార్పనం, ధ్వజారోహణం పూజలను నిర్వహించారు.

Updated Date - Feb 21 , 2024 | 10:42 PM