Kumaram Bheem Asifabad: ప్రాణహిత ప్రాజెక్టుకు 60శాతం నిధులు తీసుకొస్తా
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:24 PM
చింతలమానేపల్లి, డిసెంబరు 4(ఆంధ్ర జ్యోతి): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి రైతు లకు సాగునీరు అందించేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేంద్రప్రభుత్వం నుంచి 60శాతం నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదేనని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.
- ఆ బాధ్యత నాదే
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు
చింతలమానేపల్లి, డిసెంబరు 4(ఆంధ్ర జ్యోతి): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి రైతు లకు సాగునీరు అందించేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేంద్రప్రభుత్వం నుంచి 60శాతం నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదేనని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బుధవారం చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ రైతువేదికలో 78మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆర్థికంగా వెనకబడి ఉందని ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు చేయడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కేవలం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీముబా రక్ చెక్కులు పంపిణీ మాత్రమే చేస్తున్నట్లు ఆవేధన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజాసంక్షేమంకోసం పాటు పడుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునావర్ షరీఫ్, మల్లయ్య, శ్రీశైలం, నానయ్య, గణపతి తదితరులు పాల్గొన్నారు.