Kumaram Bheem Asifabad :సమగ్ర కుటుంబ సర్వేను సమన్వయంతో పూర్తిచేయాలి
ABN , Publish Date - Nov 04 , 2024 | 10:48 PM
ఆసిఫాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే కార్యక్రమాన్ని అధికారులు సమన్వ యంతో పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే కార్యక్రమాన్ని అధికారులు సమన్వ యంతో పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్ దీపక్‌తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఈనెల6నుంచి ప్రారంభ మయ్యే సర్వేపై మండలప్రత్యేకాధికారులతో సమీక్షాసమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌మాట్లా డుతూ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్‌లు, పంచాయతీ ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు సమన్వ యంతో పనిచేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికా రులు సర్వేనిర్వహణపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి విజయవంతం చేయాలని తెలిపారు.
సమగ్ర సర్వే పక్కాగా చేయాలి: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్: సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా చేయాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఎన్యుమరేటర్లకు సర్వే బ్లాక్‌లు కేటాయించామన్నారు. తమకు కేటాయించిన ఇండ్లను సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను నిర్ణీత సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్, కమిషనర్ అంజయ్య, ఎంపీడీవో రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.