Share News

Kumaram Bheem Asifabad: కష్టాల్లో పత్తి రైతు

ABN , Publish Date - Dec 29 , 2024 | 10:20 PM

కెరమెరి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసిరాలేదు. సీజన్‌ ప్రారం భంలో మురిపించిన వర్షాలు పంట కాత, పూతదశలో ముఖం చాటేశాయి. దీంతో పత్తిలో పూత, కాత రాలిపో యింది.

Kumaram Bheem Asifabad:  కష్టాల్లో పత్తి రైతు

- గణనీయంగా తగ్గిన దిగుబడి

- ఎకరానికి 3నుంచి 4క్వింటాళ్లు మాత్రమే

- అది కూడా ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్న రైతులు

కెరమెరి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసిరాలేదు. సీజన్‌ ప్రారం భంలో మురిపించిన వర్షాలు పంట కాత, పూతదశలో ముఖం చాటేశాయి. దీంతో పత్తిలో పూత, కాత రాలిపో యింది. ఆశించిన స్థాయిలో కాత లేకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. అంతా ఇంతా పంట చేతికి వచ్చే సమయంలో ములిగే నక్కపై తాటికాయ పడినట్లు వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పత్తి పంట తడిసి ముద్దయింది. తడిసిన పత్తిరంగు మారి నాణ్యత దెబ్బతింది. దీంతో రైతులు తక్కువ ధరకే పంటను అమ్ముకో వాల్సిన పరిస్థితి నెలకొంది.

- నాలుగేళ్లుగా ఇవే కష్టాలు..

నాలుగు ఏళ్లుగా పత్తిసాగు చేసే రైతులు నష్టాలనే చవిచూస్తున్నారు. పూత కాత దశలో వర్షాలు ముఖం చాటేయడంతో ఒక్కో చెట్టుకు 20నుంచి 30వరకు కాయలు మాత్ర మే కాశాయి. వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలో ఒక్కోచెట్టుకు సుమారు70 నుంచి 100కాయలు కాస్తాయి. దీన్ని బట్టి పత్తి దిగుబడి ఏ మేరకు తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి రైతుకు ఎకరానికి సుమారు 8క్వింటాళ్ల దిగుబడిరాగా ఈ సీజన్‌లో మాత్రం3,4క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు.

- ఆదుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు..

జిల్లాలో ఈసారి వానాకాలం 3.5లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగైంది. సుమారు 28లక్షల క్వింటాళ్లవరకు పత్తిపంట దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం మొత్తం 17సీసీఐ కొను గోలుకేంద్రాలు ఏర్పాటుచేయగా ఇప్పటి వర కు 6,65,071క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొను గోలుచేశారు. సీసీఐ రైతులకు ఏ మాత్రం ఆదుకోలేకపోయింది. సీసీఐ అధికారులు పత్తిని కొనేందుకు ఆసక్తి కనబర్చకపో వడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రర ుుంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

- ప్రైవేటు వ్యాపారుల దోపిడీ..

రైతుల అమాయకత్వం ఆర్థిక అవ సరాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారుల అడ్డగోలుగా దోచుకుంటు న్నారు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పొడవురకం గింజపత్తికి క్విం టాలుకు రూ.7521చెల్లిస్తుండగా మధ్య రకం గింజపత్తికి రూ.7121 చెల్లిస్తు న్నారు. సీసీఐకొనుగోలు కేంద్రాల్లో ఉన్న నిబంధనలప్రకారం.. పత్తి డబ్బు లు చెల్లింపునకు కనీసం 15రోజుల గడువువిధిస్తున్నారు. గత్యం తరం లేక సీసీఐని కాదని రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తి రూ.6500 నుంచి రూ.6800వరకే విక్రయిస్తున్నారు. పంట విక్రయించిన వెంటనే డబ్బులు కావాలంటే వందకు రూ.1.50క్యాష్‌ కటింగ్‌పేరుతో కోత విధించి మిగిలినమొత్తం చెల్లిస్తున్నారు. రైతు లు తమఅవసరాల నిమిత్తం క్యాష్‌ కటిం గ్‌కు అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది.

పెట్టుబడి వస్తలేదు..

- శ్రీకాంత్‌, రైతు, గోయగాం

పత్తి రైతుకు పెట్టుబడి కూడా వస్తలేదు. పంట సాగు చేయాలంటేనే భయంగా ఉంది. ప్రభు త్వం ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు మరోసారి అప్పులు చేయాల్సిన పరి స్థితులు నెలకొన్నాయి.

Updated Date - Dec 29 , 2024 | 10:20 PM