Share News

Kumaram Bheem Asifabad : గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్‌

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:10 PM

వాంకిడి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని గిరి జన బాలికలఆశ్రమోన్నత పాఠశా లలోని విద్యార్థినులు మూడు రోజుల నుంచి వాంతులు, విరేచ నాలతో అస్వస్థతకు గురవుతున్నా రు.

Kumaram Bheem Asifabad :   గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్‌

వాంకిడి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని గిరి జన బాలికలఆశ్రమోన్నత పాఠశా లలోని విద్యార్థినులు మూడు రోజుల నుంచి వాంతులు, విరేచ నాలతో అస్వస్థతకు గురవుతున్నా రు. బుధవారం ఉదయం దాదాపు 30మంది విద్యార్థినులు అస్వస్థ తకు గురికాగా గురువారం సాయంత్రం మరోనలుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మరో 11మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో నలుగురిని ఆసిఫాబాద్‌ప్రైవేట్‌వైద్యశాలకు ఏడుగురిని స్థానిక ప్రభుత్వవైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. వాంతులు, విరేచనాలు కావడానికి ఇంకా కారణాలు తెలియరాలేదు.

ఇంటిముఖం పడుతున్న విద్యార్థినులు..

అస్వస్తతకు గురవుతున్న విద్యార్థినులసంఖ్య పెరుగుతుండడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు వచ్చి పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లారు.

విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి..

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైనవైద్యం అందించాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి వైద్యాధికారులను, సిబ్బందినిఆదేశించారు. గురువారం గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను, ప్రభుత్వవైద్యశాలను సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులకు అంది స్తున్న వైద్యం, చికిత్సతదితరాలపై అడిగితెలుసుకున్నారు. పాఠశాలలో వంటశాల, ఆహారం, తాగునీటివసతిని పరిశీలించారు. వంటసామగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి వండాలన్నారు.

Updated Date - Nov 01 , 2024 | 11:10 PM