Kumaram Bheem Asifabad: పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
ABN , Publish Date - Oct 09 , 2024 | 10:43 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 9: పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దాసరి వేణుతోకలిసి కాటన్ కార్పొరేషన్, వ్యవ సాయ, మార్కెటింగ్, విద్యుత్, అగ్నిమాపక, రవాణా, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, అక్టోబరు 9: పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దాసరి వేణుతోకలిసి కాటన్ కార్పొరేషన్, వ్యవ సాయ, మార్కెటింగ్, విద్యుత్, అగ్నిమాపక, రవాణా, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ జిల్లాలో 23లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 17 జిన్నింగ్ మిల్లులో కొనుగోలుకు ఏర్పాట్లు చేయాల న్నారు. ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.7521 నిర్ణయించిందని తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్, తూనికలు కొలతలశాఖల అధికారులు జిన్నింగ్ మిల్లులను సందర్శించి సౌకర్యాలు, ఏర్పా ట్లపై నివేదిక అందించాలని తెలిపారు. మిల్లుల్లో పత్తినిలువలు పేరుకు పోకుండా చూడాలన్నారు. రహదారులకు ఆనుకొని మిల్లులు ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా చూడాలన్నారు. పత్తి విక్రయించేందుకు కేంద్రాలకు వచ్చే రైతు లకు తాగునీరు, ఇతర మౌళిక వసతులు కల్పిం చాలన్నారు. కొనుగోలు పూర్తయిన మూడు రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు పత్తి తేమ, నిబంధనలపై విస్తృతప్రచారం చేయాల న్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తనిఖీకేంద్రాలు ఏర్పాటుచేయాలని, నవంబర్ మొదటివారంలో పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి అహ్మద్,పత్తి కొనుగోలుకేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.