Kumaram Bheem Asifabad: బీర్సా ముండా స్ఫూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్
ABN , Publish Date - Nov 15 , 2024 | 10:08 PM
ఆసిఫాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బీర్సా ముండా స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకుసాగాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బీర్సా ముండా స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకుసాగాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బీర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీడైరెక్టర్ రమాదేవి ఆధ్వ ర్యంలో గిరిజన గౌరవదినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ దీపక్‌తివారి, జిల్లాఅటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్, ట్రైబల్‌వెల్ఫేర్ చీఫ్ ఇంజ నీర్ శంకర్, డీపీవో భిక్షపతి, శిశుసంక్షేమ శాఖా ధికారి భాస్కర్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి బీర్సా ముండా చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనం తరం బీహార్ నుంచి ప్రధానిమోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహానీయులను స్మరించు కోవాలని గుర్తు చేశారు. గిరిజనుల చట్టాలపై అవగాహన కార్యక్ర మాలు చేపడతామన్నారు. పద్మశ్రీఅవార్డు గ్రహిత స్వర్గీయ కనకరాజును కూడా గుర్తు చేసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయాలు గుర్తిండి పోయేలా కనకరాజు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో గిరిజనసంఘాల నాయకులు, అంగన్‌వాడీలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, గిరిజన సంక్షేమశాఖ సిబ్బంది పాల్గొన్నారు.