Share News

Kumaram Bheem Asifabad: కాంగ్రెస్‌లో భగ్గుమన్న గ్రూపు విభేదాలు

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:16 PM

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపువిభేదాలు గుప్పుమన్నాయి. డీసీసీఅధ్యక్షుడు విశ్వప్రసాద్‌ రావు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గఇన్‌చార్జీ శ్యాంనాయక్‌ వర్గీయులమధ్య ఎన్నో రోజులుగా కొనసాగుతున్న విబేధాలు శనివారం జరిగిన కులగణన జిల్లాస్థాయి సమావేశంలో బయటపడి తారస్థాయికి చేరుకుంది.

Kumaram Bheem Asifabad: కాంగ్రెస్‌లో భగ్గుమన్న గ్రూపు విభేదాలు

- కులగణన జిల్లా స్థాయి సమావేశంలో ఘర్షణ

- ఇరువర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు

- శ్యాంనాయక్‌ వర్గీయుల ఆందోళన

- అరెస్టు చేసిన పోలీసులు

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపువిభేదాలు గుప్పుమన్నాయి. డీసీసీఅధ్యక్షుడు విశ్వప్రసాద్‌ రావు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గఇన్‌చార్జీ శ్యాంనాయక్‌ వర్గీయులమధ్య ఎన్నో రోజులుగా కొనసాగుతున్న విబేధాలు శనివారం జరిగిన కులగణన జిల్లాస్థాయి సమావేశంలో బయటపడి తారస్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల6నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన కులగణన పైజిల్లాస్థాయి సదస్సులు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో జిల్లాకేంద్రంలోని రోజ్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాలులో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌పార్టీనాయకులు హాజరయ్యారు. ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ తనవర్గీయులతో కలిసి సమావే శానికి హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుండగా కొంతమంది నాయకులు తమకు సమావేశంఉన్నట్లు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించ డంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువర్గీయుల మధ్య వాగ్వాదం పెరగడంతో ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. ఆపై ఇరువర్గాలు పరస్పరదాడులకు దిగడంతో కొంతమంది నాయ కులకు గాయలయ్యాయి. దీంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్యఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కల్పిం చుకొని శ్యాంనాయక్‌తోపాటు అతనివర్గీయులను సమావేశంనుంచి బయ టకు తీసుకువచ్చారు. దీంతో శ్యాంనాయక్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్‌చేశారు. ఈక్రమంలో సమావేశంలోకి వెళ్లేందుకు శ్యాంనాయక్‌ వర్గీయులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని గేటు మూసి వేశారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, శ్యాంనాయక్‌ వర్గీయు లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని తెలుసు కున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజం అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళన విరమించక రోజ్‌గార్డెన్‌ ప్రధానగేటు ఎదుట బైఠాయించి డీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఎస్పీ డీవీ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు శ్యాంనాయక్‌తో పాటు అయన వర్గీయులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అదిష్ఠానానికి నివేదిస్తాం..

- కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, డీసీసీ అధ్యక్షుడు

కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధిష్ఠానం ఇచ్చినపిలుపులో భాగంగా జిల్లాకేం ద్రంలో కులగణనపై జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటు చేశాం. సమయం తక్కువగా ఉండటంతో కాంగ్రెస్‌పార్టీ వాట్సాప్‌ గ్రూపుల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు అందరికీ సమాచారం పంపించి ఆహ్వానం పలికాం. కానీ కొంతమంది నాయకులు తమకుసమాచారం ఇవ్వలేదని పేర్కొనడం సమం జసం కాదు. సమావేశాన్ని చెడగొట్టే ఉద్దేశంతోనే వారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఈవిషయంపై చర్యలుతీసుకోవాలని అదిష్ఠానానికి నివేదిస్తాం.

Updated Date - Nov 02 , 2024 | 11:16 PM