Share News

Kumaram Bheem Asifabad: వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jun 12 , 2024 | 10:42 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 12: జిల్లాలోని వంతెన, రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.

 Kumaram Bheem Asifabad:   వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 12: జిల్లాలోని వంతెన, రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని మోతు గూడ, అప్పపల్లి గ్రామాల మధ్యలోగల వాగుపై రూ.1.82కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్‌ వంతెన పను లను ఆమె జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌ బాబు, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌లు దాసరివేణు, దీపక్‌తివారితో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంతెనపనులను సత్వరమే పూర్తిచేయాలని ఆదే శించారు. వర్షాకాలం కావడంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. అనంతరం ఆసిఫాబాద్‌ మండలంలోని వాడిగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశా లలో రూ.6.20లక్షలతో నిర్మించిన గదులను ప్రారంభించారు. జయశంకర్‌బడిబాటలో భాగంగా విద్యార్థులకు ఏకరూపదుస్తులు, పాఠ్యపుస్తకాలను అంద జేశారు. ఈసందర్భంగా మంత్రి, కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావర ణంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయని అన్నారు. అర్హతగల బాలలందరు బడిలోనే ఉండాలని చెప్పా రు. ప్రభుత్వపాఠశాలల్లో చదువుకున్న వారు ఐఏ ఎస్‌ఎలు, ఐపీఎస్‌లు అయ్యారని, పట్టుదల, నిబద్దత ఉంటే ఏదీఅసాధ్యం కాదన్నారు. అంగన్‌వాడీలలో కూడా ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెడుతున్నట్లు, దీనికోసం మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ అన్ని స్థాయిలో అంగన్‌ వాడీటీచర్లకు శిక్షణఇస్తుందని తెలి పారు. కార్యక్రమంలో డీఈవోఅశోక్‌, జిల్లాసంక్షేమాధి కారిభాస్కర్‌, జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌, అధికారులు పాల్గొన్నారు.

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ఆసిఫాబాద్‌, జూన్‌ 12: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం జిల్లాపర్యటనలో భాగంగా జిలా ్లకేంద్రం లో రూ.25లక్షల నిధులతో నిర్మిస్తున్న ప్రెస్‌క్లబ్‌ భవ నానికి ఎమ్మెల్యే కోవలక్ష్మి, జడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణా రావు, డీసీసీఅధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జడ్పీటీసీ అరి గెల నాగేశ్వర్‌రావుతో కలిసి ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ రాజకీయాలకంటే ప్రజల సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ఇటీవల మరణించిన ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీ రావుకు ఘన నివాళి అర్పించారు.

జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దాం

వాంకిడి: జిల్లాను సమష్టి కృషతో అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దామని మంత్రి సీతక్క అన్నారు. బుధ వారం మండలంలోని సవాతిగ్రామంలో రూ.5లక్షల తో నిర్మించిన ఆరోగ్యఉపకేంద్రాన్ని ఆమె ప్రారంభిం చారు. అనంతరం రాయిసెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భీంరావు ఆశ యాల వెలుగులో జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కుమరంభీం చేసిన విరో చిత పోరాటం కారణంగా ఆదివాసీలు అనేక హక్కులు అనుభవిస్తున్నారని అన్నారు. త్వరలోనే జరుగనున్న కేస్లాపూర్‌ జాతరలో నిర్వహించే ప్రజా దర్బార్‌లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమ క్షంలో వివిధ సమస్యలపై అందిచే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి ఎంతోకృషిచేసిన హైమన్‌డార్ఫ్‌ పేరుతో వ్యవసాయవిజ్ఞానకేంద్రం ఏర్పాటు చేసేం దుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రాయిసెం టర్‌ పెద్దలు, పటేళ్లు, సర్‌మెడిలు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 10:42 PM