Share News

Kumaram Bheem Asifabad: గూడెం వైన్‌షాప్‌ వద్ద సందడి

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:28 PM

చింతలమానేపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సరిహద్దు గ్రామమైన మండలం లోని గూడెం గ్రామంలో వైన్‌షాప్‌ వద్ద శనివారం సాయంత్రం ఒక్కసారిగా సందడి నెలకొంది.

Kumaram Bheem Asifabad:  గూడెం వైన్‌షాప్‌ వద్ద సందడి

చింతలమానేపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సరిహద్దు గ్రామమైన మండలం లోని గూడెం గ్రామంలో వైన్‌షాప్‌ వద్ద శనివారం సాయంత్రం ఒక్కసారిగా సందడి నెలకొంది. మహారాష్ట్రలో ఎన్నికల రిజల్ట్‌ రావడంతో సంబరాలు నిర్వహించుకున్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు మద్యం తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చారు. రోడ్డుపై వాహనాలు నిలబెట్టి ఉంచడం, మద్యంప్రియులు పెద్దసంఖ్యలో ఉండడంతో వచ్చిపోయే వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Updated Date - Nov 23 , 2024 | 10:28 PM