Share News

Kumaram Bheem Asifabad: ప్రశాంతంగా గ్రూపు-3 పరీక్షలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 10:23 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం గ్రూపు-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Kumaram Bheem Asifabad:  ప్రశాంతంగా గ్రూపు-3 పరీక్షలు

- పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ

- నిమిషం ఆలస్యంగా వచ్చిన ఎనిమిది మందిని అనుమతించని అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం గ్రూపు-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 18పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4471మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు కేటాయిం చారు. దీంతో పరీక్షా కేంద్రాలకు గంట ముందే అభ్యర్థులు చేరుకున్నారు. పోలీసులు అభ్యర్థు లను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి పరీక్షాకేంద్రాలకు అనుమతించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో 9పరీక్షా కేంద్రాల్లో 2304మంది అభ్యర్థులను, కాగజ్‌నగర్‌ పట్ట ణంలోని 9పరీక్షాకేంద్రాలలో 2167మంది అభ్యర్థులను పరీక్షలు రాసేందుకు కేటాయించారు. పేపర్‌-1లో 2794 మంది అభ్యర్థులు పరీక్షలురాయగా 1677మంది అభ్య ర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2కు 2779 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 1692మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోని పరీక్షాకేంద్రాలను కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సందర్శించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షలనిర్వహణలో భాగంగా అభ్యర్థు లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి సాయిలో ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 18పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వెలుతురు, ఫ్యాన్లు, తాగునీరు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ముఖ్య పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామ న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా కట్టుదిట్టమైన భద్రతఏర్పాట్లు చేపట్టామన్నారు. మొదటిరోజు పేపర్‌-1, పేపర్‌-2పరీక్షలు పూర్తైన తరు వాత సంబంధిత పత్రాలను బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూంకు తరలించామని ఆయన పేర్కొన్నారు. వారి వెంట అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి, పరీక్షల రీజనల్‌ కోర్డినేటర్‌ లక్ష్మినర్సింహం, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా ఒకనిమిషం ఆలస్యంతోకాగజ్‌నగర్‌ లో నలుగురు, ఆసిఫాబాద్‌లో నలుగురు మొత్తం ఎనిమిది మందిని అనుమ తించలేదు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం గ్రూపు-3 పరీక్ష ప్రశాంతం గా జరిగింది. ఉదయం 9.35గంటల వరకు పరీక్ష హాలుకు అనుమతించారు. పట్టణంలో ఏడుకేంద్రాలను ఏర్పాటుచేశారు. బస్టాండు నుంచి వివిధ కేంద్రాలకు వెళ్లేందుకు కాగజ్‌నగర్‌ పోలీసులు మినీవ్యాన్‌లను ఏర్పాటు చేశారు. స్థానిక డీఎస్పీ రామానుజం, సీఐ రాజేంద్రప్రసాద్‌ ఏర్పాట్లను పరిశీలించారు. బస్టాండులో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేశారు. ఎస్సైలు దీకొండ రమేష్‌, సుధాకర్‌ గట్టిబందోబస్తు నిర్వహించారు. చేతులు లేని దివ్యాంగుడు జాకీర్‌ పాషా గ్రూపు-3 పరీక్ష రాశాడు.పరీక్షకేంద్రాల్లో వికలాంగులు కోసం ప్రత్యేక వీల్‌చైర్స్‌ను ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌..

గ్రూపు-3 పరీక్ష కేంద్రాలను ఆదివారం కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షకేంద్రా ల్లోని వసతులపై ఆరాతీశారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అలాగే పట్టణంలోని వివేకానంద జూనియర్‌ కళాశాల, సెయింట్‌ క్లారేట్‌, వసుంధర డిగ్రీకళాశాల, నవోదయ, ఫాతిమా కాన్వెంటు పాఠశాలలను పరిశీలించారు. ఆయన వెంట సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా తదితరులున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 10:23 PM