Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌లో ప్రారంభమైన ఛట్ పూజలు
ABN , Publish Date - Nov 07 , 2024 | 10:22 PM
కాగజ్‌నగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం ఛట్ పూజలు ప్రారంభమయ్యాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ వాసులు అధికంగా ఈ పూజలు చేస్తారు. ఎస్పీఎం నీటి కొలనులో దిగి గురువారం సాయంత్రం నుంచి సూర్యదేవుడికి పూజలు చేశారు.
కాగజ్‌నగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం ఛట్ పూజలు ప్రారంభమయ్యాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ వాసులు అధికంగా ఈ పూజలు చేస్తారు. ఎస్పీఎం నీటి కొలనులో దిగి గురువారం సాయంత్రం నుంచి సూర్యదేవుడికి పూజలు చేశారు. అనంతరం సూర్యదేవుడిని ఆరాధిస్తూ హారతులను పట్టారు. సూర్యాస్తమయం కాగానే తాము తెచ్చుకున్న ప్రసాదాలతో ఇంటికెళ్లారు. ఛట్ పూజల సందర్భంగా బాణసంచాను కాల్చి సంబరాలు జరిపారు.
కఠోర దీక్ష ఛట్ పూజ..
దేశవ్యాప్తంగా పేరొందినది ఛట్ పూజ. ఈ పూజ చేసేవారు ఎంతో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలో ప్రధానంగా సూర్య భాగవానుడికి పూజలు చేస్తారు. ఈ ఛట్ పూజలు ప్రధానంగా ఉత్తర భారతీయులు అధికంగా చేస్తారు. భూమి మీద మనుగడ కల్పించిన సూర్య భాగవానుడికి కృతజ్ఙతలు తలుపుతూ ఈ పూజలు చేస్తారు. ఈ పూజలు చేస్తే ఆయురారోగ్యాలు, ఆనందాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని భక్తుల ప్రగాఽఢనమ్మకం. పాండవులు, ద్రౌపది ఛట్ పూజలు చేసినట్టు మహాభారతంలో కథనాలున్నాయి. ఈ పూజల్లో పాటించే పద్ధతుల్లో నహయ్ ఖాయ్ అంటే మొదటి రోజు భక్తులు శుద్ధి చేసిన నది లేదా తీరంలో స్నానం చేసి స్వచ్ఛతను పాటిస్తారు. లోహండా, ఖర్జా రెండోరోజు ఉపవాసం. సాయంత్రం చేసిన ప్రసాదం తీసుకుంటారు. సంధ్యా ఆర్ధ్య మూడవ రోజు. సూర్యస్తమయానికి పూజచేసి, నది లేదా సరస్సు ఒడ్డున నెయి, నూనెతో దీపాలు, పండ్లను సమర్పించి సూర్య భగవా నుడిని ఆరాధిస్తారు. ఉషా అర్థ్య ఈ పూజలో చివరిరోజు అనగా వేకువ జామునే సూర్యదేవుడికి హారతి, పూజలు చేసి నైవేధ్యాలు సమర్పించి పూజను ముగిస్తారు.