Kumaram Bheem Asifabad: సివిల్ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి: ఎస్పీ
ABN , Publish Date - Nov 18 , 2024 | 10:36 PM
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్ర జ్యోతి): సివిల్ ఫిర్యాదు లను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు.
- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్ర జ్యోతి): సివిల్ ఫిర్యాదు లను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. సోమ వారం ప్రజావాణి కార్య క్రమంలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యా దులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. భూములకు సంబంధించి గొడవలు పెట్టుకో రాదని అందరు సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు. అధికా రులు బాధితులు తీసుకువచ్చే ఎలాంటిఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచరాద న్నారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని బాధితులకు తప్పకుండా తెలపా లని సూచించారు. ప్రస్తుతం సైబర్‌నేరాలు పెరుగుతున్నాయని వాటిపట్ల అప్ర మత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో డయల్ 100 లేదా 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.