Share News

Kumaram Bheem Asifabad: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:27 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబసర్వేను పకడ్బంధీగా నిర్వహించా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:   సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబసర్వేను పకడ్బంధీగా నిర్వహించా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ పట్టణంలోని సందీప్‌నగర్‌ లో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమగ్ర కుటుంబసర్వే కార్యక్ర మంలో కుటుంబసభ్యుల వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్లు ప్రత్యేకఅధికారులు సమన్వయంతో పనిచే యాలన్నారు. సర్వేప్రక్రియలో భాగంగా కేటాయిం చిన ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ల ప్రకారం ఇళ్లను సందర్శించి కుటుంబ వివరాలను నిర్ణీతనమునాలో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. సర్వేచేసిన ప్రతిఇంటికి మార్క్‌ చేయాలని తెలిపారు. సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తారో సంబంధిత కుటుంబసభ్యులకు సమ చారం అందించాలని, ఇంటి యజమానులు అవసరమైన పత్రాలతో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువు తేదీలోగా సర్వే పూర్తిచేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచే యాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: సమగ్ర కుటుంబ సర్వే వివరాలను స్పష్టంగా నమోదుచేయాలని కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా అన్నారు. గురువారం పట్టణంలో చేపడుతున్న సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్వేలో కుటుంబసభ్యుల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కేటాయించిన ఎన్యూమరేషన్‌ బ్లాక్‌ల ప్రకారం ఇళ్లను సందర్శించి కుటుంబ సభ్యులు వివరాలను నిర్ణీత నమునాలో స్పష్టంగా నమోదుచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:27 PM