Kumaram Bheem Asifabad: సమగ్ర శిక్షా ఉద్యోగుల వంటావార్పు
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:42 PM
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడు తున్న సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది.
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడు తున్న సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 18వరోజుకు చేరుకోగా దీక్షాశిబిరం వద్ద వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనాలు చేశారు. అంతకుముందు భారత మాజీప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల నివాళులు అర్పించారు. దీక్షాశిబిరాన్ని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోట్నాక విజయ్‌కుమార్, నాయకులు కోవ విజయ్, భగవంతరావు, శంకర్, భరత్‌భూషన్, ప్రవీణ్, జనార్దన్ సంద ర్శించి తమ మద్దతు తెలిపి మూడు వేల ఆర్థిక సహాయం అదించారు. అలాగే బీజేపీ నాయకులు వెర్రబల్లి రఘునాథరావు, కొత్తపల్లి శ్రీనివాస్, మల్లికార్జున్, బోనగిరి సతీష్‌బాబు, విశాల్, ఎమ్మెల్సీ అభ్యర్తి మధుసూద న్‌రావు, ఎస్‌జీటీ జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి చైతన్యలు మద్దతు తెలిపారు.