Share News

Kumaram Bheem Asifabad: సీపీఐ ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:00 PM

రెబ్బెన, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన గోలేటి కేఎల్‌ మహేంద్రభవన్‌ కార్యాలయం వద్ద గురువారం సీపీఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ పార్టీజెండాను ఆవి ష్కరించారు.

Kumaram Bheem Asifabad:   సీపీఐ ఆవిర్భావ వేడుకలు

రెబ్బెన, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన గోలేటి కేఎల్‌ మహేంద్రభవన్‌ కార్యాలయం వద్ద గురువారం సీపీఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ పార్టీజెండాను ఆవి ష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్యాగాలచరిత్ర, పోరాటాల పటిమగల పార్టీకేవలం సీపీఐ మాత్ర మేనని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఎనలేని పోరాటం చేసినట్టు తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా రాగద్వేశాలకతీతంగా సీపీఐ పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి బి జగ్గయ్య, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌ తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్యమొగిలి, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీలు శేషరావు, జూపాక రాజేష్‌, కిరణ్‌, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:00 PM