Kumaram Bheem Asifabad : డాటా ఎంట్రీని వేగవంతం చేయాలి
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:21 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): సమగ్ర కుటుంబ కులగణన సర్వే వివరాల డేటా ఆన్‌లైన్‌ఎంట్రీని ఆపరేటర్లు త్వరగా పూర్తి చేయాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. బుధవారం డాటా ఎంట్రీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
-సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా
కాగజ్‌నగర్, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): సమగ్ర కుటుంబ కులగణన సర్వే వివరాల డేటా ఆన్‌లైన్‌ఎంట్రీని ఆపరేటర్లు త్వరగా పూర్తి చేయాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. బుధవారం డాటా ఎంట్రీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేవివరాలను తప్పులు లేకుండా నమోదుచేయాలన్నారు. అనంతరం మండలలెవల్‌స్టాకిస్ట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమెవెంట మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..
బెజ్జూరు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిం చాలని కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు. బుధవారం ఆమె మండలకేంద్రంలోని ఆశ్రమబాలికల గిరి జన, కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్య మైన భోజనం అదించాలన్నారు. కేజీబీవీలో నాణ్యమైన కూరగాయలు లేకపోవడంతో కూరగాయలు సరఫరా చేసే వారికి షోకాజు నోటీసులు జారీచేయాలని తహసీల్దార్ భూమేశ్వర్‌ను ఆదేశించారు.
కేజీబీవీలో, ఆశ్రమపాఠశాలలో మెనూ తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న కుటుంబ సర్వే ఆన్‌లైన్ డాటా ఎంట్రీని పరిశీలించారు. త్వరగా డాటా ఎంట్రీ పూర్తిచేయాలన్నారు. ఆమెవెంట తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో గౌరీశంకర్, ఆర్‌ఐ సంతోష్, ఎస్‌వో అరుణ, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్‌రావు తదితరులు ఉన్నారు.