Kumaram Bheem Asifabad: పత్తిని దళారులకు అమ్ముకోవద్దు: ఎమ్మెల్యే హరీష్‌బాబు
ABN , Publish Date - Nov 13 , 2024 | 10:36 PM
సిర్పూర్(టి), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రైతులు పత్తిని దళారులకు అమ్మకుండా సీసీఐ ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రర ుుంచాలని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు.
- ఎమ్మెల్యే హరీష్‌బాబు
సిర్పూర్(టి), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రైతులు పత్తిని దళారులకు అమ్మకుండా సీసీఐ ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రర ుుంచాలని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. బుధ వారం మండలకేంద్రంలోని శ్రీరామ కాటన్ జిన్నిం గ్ మిల్లులో ఏర్పాటుచేసిన పత్తికొనుగోలు కేంద్రా న్ని ఆయనప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈసారి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 7521ధర నిర్ణయించిందని రైతులుసీసీఐ కొను గోలు కేంద్రాల్లోనే పత్తినిఅమ్ముకోవాలన్నారు. దళా రులకు అమ్ముకున్నట్లయితే రైతులు అన్నివిధాల నష్టపోతారన్నారు.
కాగజ్‌నగర్ మార్కెట్‌కమిటీ చైర్మన్ దేవయ్య మాట్లాడుతూ రైతుల సౌకర్యం కోసం ప్రభుత్వం పత్తికొనుగోలుకేంద్రం ప్రారంభిం చిందన్నారు. ఏడీఏమనోహర్ మాట్లాడుతూ రైతులు పత్తిని విక్రయించేటప్పుడు తప్పకుండా పట్టాపాసు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ను నమోదుచేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే ఏఈవోలనుఅడిగి తెలుసుకోవాలన్నారు. తేమ 12 శాతం ఉండకుండా చూసుకునేబాధ్యత రైతులదే నన్నారు. ఈవిషయాన్ని రైతులు గమనించి తేమశాతం అధికంగా లేకుండా చూడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను జిన్నింగ్ మిల్లుయజమాని సిద్ధయ్య సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, సత్యనారాయణ,అశోక్, సాయి, ప్రశాంత్, విలాస్, నాని, మార్కెట్‌కమిటీకార్యదర్శి భాస్కర్, వ్యవసాయాధికారి గిరీష్,సీసీఎల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.