Share News

Kumaram Bheem Asifabad: వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 10:59 PM

బెజ్జూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని అదనపుకలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేశారు.

Kumaram Bheem Asifabad:   వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

- అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

బెజ్జూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని అదనపుకలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేశారు. ఆసుపత్రిలో మందుల స్టాక్‌, స్టాఫ్‌ అటెండెన్స్‌ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైనవైద్యం అందించాలని సూచించారు. వైద్యులు ప్రతిరోజు విధులకు హాజరవుతున్నారా అని సిబ్బంది అడిగితెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 34కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇప్పటివరకు 6700 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. బెజ్జూరు కొనుగోలు కేంద్రంలో మందకొడిగా నడుస్తోందని రెండు మూడురోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేసి ధాన్యాన్ని పం పించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహ సీల్దార్‌ భూమేశ్వర్‌, డీటీ భీమ్లానాయక్‌, ఆర్‌ఐ అచ్యుతరావు, సంతోష్‌, ఏపీఎం మోహన్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలుకేంద్రం పరిశీలన..

చింతలమానేపల్లి: మండలకేంద్రంతోపాటు రవీంద్రనగర్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు, రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ట్యాబ్‌లో వెంటనే నమోదు చేయాలని, వర్షంలో ధాన్యం తడవకుండా చూడాలని సూచించారు. ఎంత ధాన్యం కేంద్రానికి వచ్చిందని ఆరా తీశారు. ఆయన వెంట ఆర్‌ఐ విజయ్‌కుమార్‌, బీసీఏవో రబ్బానీ, సహకార సంఘం సిబ్బంది తాజీంహుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:00 PM