Share News

Kumaram Bheem Asifabad : పులి వదంతులను నమ్మవద్దు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:40 PM

సిర్పూర్‌(టి), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం లోని అన్ని మం డలాల్లో గ్రామ స్థులు పులి సంచారంపై వచ్చే వదంతులను నమ్మ వద్దని జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad :   పులి వదంతులను నమ్మవద్దు

- జిల్లా అటవీఅధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌

సిర్పూర్‌(టి), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం లోని అన్ని మం డలాల్లో గ్రామ స్థులు పులి సంచారంపై వచ్చే వదంతులను నమ్మ వద్దని జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని అటవీశాఖ కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ సిర్పూర్‌(టి), కాగజ్‌న గర్‌ అటవీప్రాంతాల్లో పులికోసం డ్రోన్‌కెమెరాలతో విస్తృతంగా తనిఖీచేపడుతున్నట్లు తెలిపారు. మండ లాల్లో కొంతమంది పులిఉందని పుకార్లు లేపుతున్నా రని వాటిని ఎవరు కూడా నమ్మవద్దన్నారు. గత ఆదివారం తమ పరిశీలనలో ఆడపులి మహారాష్ట్రకు వెళ్లిందని తేలిందని, మగపులి.. మాలిని, మెట్‌పల్లి, రావన్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తపడాలన్నారు. ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు.

గ్రామాల్లో పులి సంచారంపై అవగాహన

దహెగాం/చింతలమానేపల్లి/కెరమెరి: మండ లాల్లో, గ్రామాల్లో అటవీఅధికారులు సోమవారం పులి సంచారంపై అవగాహన కల్పించారు. భయాందోళ నకు గురికావద్దని పులిగురించి ఏమైనా సమాచారం తెలిస్తే అటవీఅధికారులకు తెలియజేయాలన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న చేనులలో రైతులు హెల్మెట్‌ పెట్టుకోవాలన్నారు. గుంపులుగా అటవీ ప్రాంతాలకు వెళ్లాలని, ఒకరిద్దరు వెళ్లరాదన్నారు. అటవీ ప్రాంతం లో నిశ్శబ్దంగా ఉండకుండా చప్పుడు చేయాలన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:40 PM