Kumaram Bheem Asifabad: రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - May 29 , 2024 | 09:48 PM
ఆసిఫాబాద్, మే 29: రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో చిరంజీవి అన్నారు.
ఆసిఫాబాద్, మే 29: రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో చిరంజీవి అన్నారు. బుధవారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. లూజుగా ఉన్న సంచు ల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదని, విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రశీదు తప్పనిసరిగా తీసుకోవాల న్నారు. విత్తన ప్యాకెట్‌లు, బిల్లులు పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలన్నారు. గుర్తింపు పొందిన అధీకృత డీలర్‌వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయా లన్నారు. ప్యాక్‌చేసి లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఎవరైనా లూజు విత్తనాలు అమ్మితే వ్యవసాయశాఖకు కానీ, పోలీసులకుకానీ సమా చారం అందించాలన్నారు. అలాగే వాడిగొందిలో ఏఈవో రాము, మెంగుబాయి గూడలో ఏఈవో రెహమాన్ రైతులకు విత్తన కొనుగోళ్లపై అవగాహన కల్పించారు.
నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి..
చింతలమానేపల్లి/బెజ్జూరు/దహెగాం: రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమ త్తంగా ఉండాలని ఏఈవోలు విజయ్, రవితేజ, ఆనంద్ అన్నారు. బుధవారం చింతల మానేపల్లి మండలం కర్జవెల్లి, బెజ్జూరు మండలం అందవెల్లి, దహెగాం మండలంలోని కుంచ వెల్లి గ్రామాల్లో వారు రైతులకు అవగాహన కల్పించారు.
లైసెన్సులు కలిగిన దుకా ణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాల న్నారు. లూజ్ విత్తనాలు అమ్మితే వ్యవ సాయాధికారులకు తెలియ జేయాలన్నారు. విత్తనాలు కొన్న ప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన బిల్‌లో లాట్‌నెంబర్, వెరైటీ పేరు, ఎక్స్‌పైరీ వంటి విషయాలు ఉన్నాయా లేవా అన్నది ప్యాకెట్‌పై చూడా లన్నారు. పత్తిపంటలో ఎరువుల యజమాన్యం గురించి వివరించారు. వేసవి దుక్కులు, పచ్చి రొట్ట ఎరువుల ద్వారా కలిగేప్రయోజనాలకు రైతులకువివరించారు.అలాగే రైతులు ఈ-కేవీసీ చేయించుకోవాలన్నారు.
సిర్పూర్(టి): నకిలీవిత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ఏఈ వోలు నేహతబసుం, కవిత, శోభ అన్నా రు. బుధవారం సిర్పూర్(టి) మండ లంలోని వెంపల్లి, వెంకట్రావుపేట, చింతకుంట గ్రామ పంచాయతీల్లో నకి లీవిత్తనాల కొనుగోలుపై అవగాహన నిర్వహించారు. లైసెన్సులు కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. అలాగే పలు జాగ్రత్త లను వివరించారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం అందిం చాలన్నారు.