Share News

Kumaram Bheem Asifabad: మండలాల్లో పులి భయం..

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:26 PM

పెంచికలపేట, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా మండలంలో పెద్దపులి కదిలికలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి కొండపల్లి బీట్‌లో పులి అడుగులను అటవీఅధికారులు గుర్తించారు.

 Kumaram Bheem Asifabad: మండలాల్లో పులి భయం..

పెంచికలపేట, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా మండలంలో పెద్దపులి కదిలికలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి కొండపల్లి బీట్‌లో పులి అడుగులను అటవీఅధికారులు గుర్తించారు. అలాగే ఎర్ర గుంట శివారులోని నీటికుంట వద్ద నీటిని తాగినట్లు సోమ వారం గుర్తించారు. మంగళవారం బొంబాయిగూడ గ్రామ సమీపాన ఉచ్చమల్లవాగులో గ్రామసమీపాన పంట పొలాల్లో, కొండపల్లి బొక్కివాగు ప్రాంతంలో పులిపాద ముద్రలను స్థానికులు గుర్తించి అటవీఅధికారులకు సమాచారం అందించారు. వారు ఆ ప్రాంతానికి చేరుకుని పులి అడుగులు లేవని నిర్ధారించారు. అయితే అవి ఒక రోజు క్రితం అడుగులని తెలిపారు. గ్రామ శివారులో పులి పాదముద్రలు కల్పించడంతో ఆయాగ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పత్తి ఏరివేతకు కూలీలు ముందుకు రావడం లేదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

దహెగాం: మండలంలో పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఎస్‌వో సద్దాం హుస్సేన్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రానికి సమీపంలోని పెద్ద వాగు వద్ద పులిఅడుగులు కనిపించడంతో వాటిని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద వాగు సమీపంలోని చేనులలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 10తరువాత వెళ్లి, సాయంత్రం 4గంటలకు ఇంటికి చేరాలన్నారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌వో రవి, ఎఫ్‌బీవోలు వెంకటేష్‌, సురేందర్‌, సద్దాం తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:26 PM