Share News

Kumaram Bheem Asifabad: సదస్సుకు పూర్తి ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:06 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడిజిల్లాకేంద్రాల్లో అన్ని కులాల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించే సదస్సులకు పూర్తిఏర్పాట్లు చేయాలని రాష్ట్రవెనకబడిన తరగతుల కమిషన్‌చైర్మన్‌ నిరంజన్‌గౌడ్‌ అన్నా రు.

 Kumaram Bheem Asifabad:  సదస్సుకు పూర్తి ఏర్పాట్లు చేయాలి

- రాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌గౌడ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడిజిల్లాకేంద్రాల్లో అన్ని కులాల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించే సదస్సులకు పూర్తిఏర్పాట్లు చేయాలని రాష్ట్రవెనకబడిన తరగతుల కమిషన్‌చైర్మన్‌ నిరంజన్‌గౌడ్‌ అన్నా రు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వెనుకబడిన తరగతుల కమిషన్‌ కార్యాలయం నుంచి కమిటీసభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మిరంగు, కార్యదర్శి బాలమాయాదేవితో కలిసి జూమ్‌ మీటింగ్‌ద్వారా అన్నిజిల్లాల కలెక్టర్‌లు, అదనపుకలెక్టర్‌లు, వెనకబడిన తరగ తుల సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వెనకబడిన తరగతుల కమిషన్‌చైర్మన్‌ మాట్లాడుతూ ఉమ్మడిజిల్లా కేంద్రాల్లో సమగ్ర కులసర్వేపై సదస్సులను నిర్వహిస్తామన్నారు. ఈసదస్సుకు జిల్లా లోని అన్నికులాల ప్రతినిధులు, స్వచ్ఛందసంస్థల సభ్యులను ఆహ్వానించా లని అన్నారు. సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పా ట్లుచేయాలని తెలిపారు. జిల్లాకలెక్టరేట్‌ నుంచి అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి మాట్లాడుతూ ఉమ్మడిజిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌లో ఈనెల28న వెనకబ డిన తరగతుల కమీషన్‌ ఆద్వర్యంలో నిర్వహించే సదస్సుకు జల్లాలోని అన్ని కులాల ప్రతినిధులు, స్వచ్ఛందసంస్థల సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, స్థానికప్రజాప్రతినిధులు, అఽధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సు విజయవంతంచేసే దిశగాచర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ దాసరివేణు, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వరరావు, జడ్పీసీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్‌, జిల్లా సంక్షేమాధికారి సజీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:06 PM