Kumaram Bheem Asifabad: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:14 PM
ఆసిఫాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వానాకాలం వరిధాన్యం కొనుగోలుకేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు.
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఆసిఫాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వానాకాలం వరిధాన్యం కొనుగోలుకేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిజిల్లాలకలెక్టర్‌లు, పౌరసరఫరాలశాఖ అధికారుల తో సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్‌తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపుకలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 34కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని ఈ నెల15నుంచి వరికోతలు ప్రారంభం అవుతాయని తెలిపారు. సహకార శాఖ, ఐకేపీఆధ్వర్యంలో కొనుగోలుకేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గోదాంల పరిశీలన, జిల్లా లోని రైస్‌మిల్లర్లతో సమావేశం, బ్యాంకు గ్యారంటీ, మిగిలిన సీఎంఆర్ లక్ష్ల్యాలను పూర్తిచేసేందుకు పర్యవేక్షిస్తామని తెలిపారు. ధాన్యం విక్ర యించేందుకు కొనుగోలుకేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా తాగునీరు, నీడ, తూకం యంత్రాలు, టార్పాలిన్ కవర్లు, తేమయంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తున్నం దున సన్నరకం, దొడ్డురకం ధాన్యం కొనుగోలు కొరకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల, మార్కెటింగ్, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలి..
- రాష్ట్రఆర్థికశాఖ ప్రత్యేకకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
ఆసిఫాబాద్‌రూరల్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన అంశాలపై ప్రభు త్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేకకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిజిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రతి ఎన్యుమ రేటర్ ప్రతిఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు సేకరించాలని తెలిపారు. కేటాయించిన ఎన్యుమరేషన్ బ్లాక్‌కింద నిర్ణయించిన కుటుంబాల వివరాలు నమోదు చేయాలన్నారు. వివరాల సేకరణలో గోప్యత, నైతిక ప్రమా ణాలు పాటించాలన్నారు. కేటాయించిన బ్లాక్‌లో అన్ని కుటుం బాలు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్‌తివారి, ఆర్డీవోలోకేశ్వర్‌రావు, ముఖ్యప్రణాళికాధికారి కోటయ్యనాయక్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6నుంచి ప్రారంభమయ్యే సర్వేకు జిల్లాలో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటి యజమానుల జాబితాను రూపొందించామని తెలిపారు. జిల్లాలో 1543 ఎన్యుమరేటషన్ బ్లాక్‌లను గుర్తించామన్నారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలలో సర్వే నిర్వహణ కొరకు ఎస్‌జీటీలు, ఇతర సమర్థులైన సిబ్బంది నియమించామని తెలిపారు. 168మంది సూపర్‌వైజర్లుగా నియమించామన్నారు. కార్యక్రమంలో డీపీవో భక్షపతిగౌడ్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్‌లు, విద్యాశాఖాధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.