Kumaram Bheem Asifabad: ఘనంగా బులాయి వేడుకలు
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:47 PM
ఆసిఫాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దీపావళిపర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండలం రాజురాగ్రామంలో ఆదివారం బులాయివేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దీపావళిపర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండలం రాజురాగ్రామంలో ఆదివారం బులాయివేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగరోజు ప్రారంభమైన ఈ వేడుకలు మూడురోజులపాటు కొనసాగాయి. మొదటిరోజు సంప్రదాయంగా మట్టిని తెచ్చి బులాయి మట్టి ప్రతిమలను తయారుచేసి ప్రత్యేక పూజలు చేశారు. శనివారంరాత్రి ప్రతిమలను బతుకమ్మలవలే మధ్యలోపెట్టి యువతులు, మహిళలు బులాయి ఆడారు. ఆదివారం ఉదయంగ్రామంలోని పెద్ద వాగులో బులాయి ప్రతిమలను నిమజ్జనం చేశారు.