Kumaram Bheem Asifabad: ప్రశాంతంగా ముగిసిన గ్రూపు-3 పరీక్షలు
ABN , Publish Date - Nov 18 , 2024 | 10:39 PM
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల్లో నిర్వహించిన గ్రూపు-3పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణాల్లో 18పరీక్షాకేంద్రాలు
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల్లో నిర్వహించిన గ్రూపు-3పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణాల్లో 18పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా పేపర్-3కి 4471మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 2757మందిఅభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 1714మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రం లోని మాతృశ్రీడిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. అలాగే పట్టణంలోని పీటీజీ బాలురగురుకులపాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను పరీ క్షల నోడల్ అధికారి, అదనపుకలెక్టర్ దీపక్ తివారి సంద ర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూపు-3పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతా వరణంలో సజావుగా నిర్వహించామ న్నారు. పరీక్షల నిర్వహణలో అభ్య ర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ కుండా పూర్తిఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్య పర్యవేక్షకులు, ఆయాశాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకు న్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షలు పూర్తిఅయినందున ఓఎంఆర్‌జవాబు పత్రాలను భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూంకు తరలించామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పరీక్షల రీజనల్‌కో ఆర్డినేటర్ లక్ష్మినర్సింహం, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.