Share News

Kumaram Bheem Asifabad: ఈదురుగాలులు.. పిడుగులు

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:09 PM

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిం చింది.

 Kumaram Bheem Asifabad: ఈదురుగాలులు.. పిడుగులు

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిం చింది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, వాంకిడి, బెజ్జూరు, సిర్పూర్‌(టి), పెంచికలపేట, చింతలమానేపల్లి, దహె గాం మండలాల్లో ఈదురుగాలులతో కూడినవర్షం కురిసింది. దీంతో ఆసిఫాబాద్‌ మండలంలోని జెండా గూడ గ్రామంలో ఇంటి పైకప్పురేకులు ఎరిగిపడ్డాయి. వారసంతలో ఈదురుగాలులకు వీధివ్యాపారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాంకిడి మండ లంలో ఈదురుగాలుల బీభత్సానికి ఆయాగ్రామాల్లో ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి.

తెగిన గుండి

తాత్కాలిక రోడ్డు

ఆసిఫాబాద్‌ రూరల్‌: మండ లంలోని గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు ఆదివారం కురిసిన వర్షానికి మళ్లీ తెగి పోయింది. పది హేను రోజుల క్రితం కురిసిన వర్షానికి తెగిపోగా మరోసారి తాత్కాలిక రోడ్డును వేశారు. కాగా ఆది వారం కురిసిన వర్షానికి అదికూడా కొట్టుకుపోయింది. దీంతో గుండి దాని పరిసర గ్రామాల ప్రజలు ఆసిఫా బాద్‌కు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పిడుగుపాటుకు పది మేకలు మృతి..

ఆసిఫాబాద్‌ మండలం బెల్గాం గ్రామంలో పిడుగు పడి పదిమేకలు మృతిచెందాయి. బెల్గాం గ్రామానికి చెందిన లోనారే హనుమంతు తన 30మేకలను మేతకు తీసుకువెళ్లి వస్తుండగా వర్షం కురిసింది. కొద్దిసేపటికి వర్షంతో పాటే పిడుగుపడింది. దీంతో పది మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని హనుమంతు కోరాడు.

బెజ్జూరు అతలాకుతలం..

బెజ్జూరు: బెజ్జూరు మండ లంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిం చిం ది. దీంతో ప్రజలు అతలాకు తలమయ్యారు. బెజ్జూరు, ఎల్కపల్లి, చిన్నసిద్దాపూర్‌, హేటిగూడ, రంగాపూర్‌, పెద్దసిద్దాపూర్‌ తదితర గ్రామాల్లో గాలివానబీభత్సం సృష్టించడంతో పలువురి ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలుగ్రామాల దారులపై చెట్లు విరిగిపడడంతో రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. బెజ్జూరు-ఎల్కపల్లి గ్రామాల మధ్య రెండు విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలువురి ఇళ్లపై చెట్లు విరిగిపడడంతో ప్రజలు భయాం దోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. బెజ్జూరుకు చెందిన నానయ్య ఎద్దుపై చెట్టుపడడంతో తీవ్రగాయాలయ్యా యి. ఎల్కపల్లిలో లింగయ్య మేకపై చెట్టుపడడంతో మృతిచెందింది.

పెంచికలపేట: మండలంలోని కొండపల్లి గ్రామంలో తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు రావ డంతో ప్రజలు పరుగులు తీశారు. ఎల్కపల్లి, లోడ్‌ పల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి.

దహెగాం: మండలంలో ఖర్జీలో ఈదురు గాలు లకు పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్‌స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

సిర్పూర్‌(టి): మండలంలోని రైల్వేస్టేషన్‌ రహదారిలోని చెట్టుపై పిడుగుపడి మంటలు అంటు కున్నాయి. గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.

పిడుగు పాటుకు మహిళకు గాయాలు

వాంకిడి: మండలంలోని ఇందాని గ్రామంలో పిడుగుపడడంతో దుర్గం వికృబాయికి గాయాల య్యాయి. మధ్యాహ్నం వర్షం కురియడంతో ఇంటి ముందు ఉన్న చెట్టుకింద వికృబాయి నిలబడింది. అదేసమయంలో చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను బంధువులు చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అలాగే పలువురి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.

Updated Date - Jun 02 , 2024 | 10:09 PM