Share News

Kumaram Bheem Asifabad: వరి కోతకు వచ్చిన తరువాతే కోయాలి

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:37 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వరి పూర్తి కోతకు వచ్చిన తరువాత మాత్రమే యం త్రాలు వినియోగించి పంట కోయిం చాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

Kumaram Bheem Asifabad:  వరి కోతకు వచ్చిన తరువాతే కోయాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వరి పూర్తి కోతకు వచ్చిన తరువాత మాత్రమే యం త్రాలు వినియోగించి పంట కోయిం చాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధ శుక్లాతో కలిసి వ్యవసాయ, సహ కార, గ్రామీణాభివృద్ధి, పౌరసర ఫరాలశాఖల అధికారులు, హార్వె స్టర్‌ యజమానులతో వానాకాలం కోతలపై సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వరిపంట పూర్తి కోతదశకు వచ్చిన తరువాత మాత్రమే కోయించాలని తెలిపారు. కోతకు వచ్చిన తరువాత కోయడం ద్వారా తేమశాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్య మైన పంట వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా రైతులకు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు బిక్కు, రబ్బానీ, అదనపు గ్రామీణాభి వృద్ధి అధికారి రామకృష్ణ, వ్యవ సాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, హార్వెస్టర్‌ యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 10:37 PM