Share News

Kumaram Bheem Asifabad: పలు మండలాల్లో భారీ వర్షం

ABN , Publish Date - Oct 30 , 2024 | 11:24 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది.

Kumaram Bheem Asifabad: పలు మండలాల్లో భారీ వర్షం

- నేలకొరిగిన వరి.. తడిసిన ధాన్యం

ఆసిఫాబాద్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌, కెరమెరి, వాంకిడి,కౌటాల మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా దహెగాం, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో భారీవర్షం కురిసింది. భారీవర్షానికి ఆయామండలాల్లోని పొట్టదశలో ఉన్న వరి నేలకొరిగింది. పత్తిపంట తడిసి ముద్దయింది. దహెగాం మండలాల్లో కల్లాలో ఆరబెట్టిన వరి ధాన్యం భారీవర్షానికి తడిసి ముద్దయింది. భారీవర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కవర్లు కప్పి ధాన్యాన్ని రక్షించుకునేందుకు తిప్పల పడ్డారు.

పెంచికలపేట/ దహెగాం/చింతలమానేపల్లి: పెంచికలపేట మండలంలోని చెడ్వాయి. గుంట్లపేట, మొట్లగూడ, పోతపల్లి, బొంబాయిగూడ గ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. కల్లాల్లో తడిసి అరబెట్టిన వరి ధాన్యం ముద్ద అయింది. చేతికి అందిన పత్తి పంట భారీ వర్షానికి తడిసి ముద్ద అయింది. కాక పోతే నెల రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న మిరప పంటల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:24 PM