Share News

Kumaram Bheem Asifabad: మంత్రి సీతక్కపై ఆరోపణలు చేయటం సరికాదు

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:58 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18: మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిని మరిచి మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోనప్పతోపాటు తనపై నిరా ధార ఆరోపణలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరువు నష్టం దావా కూడా వేయనున్నట్టు తెలిపారు.

 Kumaram Bheem Asifabad: మంత్రి సీతక్కపై ఆరోపణలు చేయటం సరికాదు

-సిర్పూరు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18: మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిని మరిచి మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోనప్పతోపాటు తనపై నిరా ధార ఆరోపణలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరువు నష్టం దావా కూడా వేయనున్నట్టు తెలిపారు. గిరిజన మహిళ అయిన మంత్రి సీతక్కపై లేనిపోని ఆరోపణలు చేయటం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప, తాను ప్రజాసేవ చేస్తున్నట్టు తెలిపారు. రైస్‌మిల్లు యాజమానుల నుంచి పెద్దమొ త్తంలో డబ్బులు తీసుకొని వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపించారు. జిన్నింగ్‌ మిల్లుల యాజమానులతో కుమ్మక్కై పత్తిరైతులకు నష్టం చేసినట్టు ఆరోపించారు. మంత్రి ఆమోదంతో సిర్పూరు రోడ్డు, అందవెల్లి పనులను శరవేగంగా కొనసాగిస్తూ ఆ పనులను సందర్శించి సోషల్‌ మీడియాలో తానే చేసినట్టు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో నాయకులు మాజీమున్సిపల్‌ ఛైర్మన్‌ దస్తగీర్‌, వివి ప్రసాద్‌, వార్ల తిరుపతి, ఫైసల్‌బీన్‌ సులేమాన్‌, కౌన్సిలర్లు ఎల్లేష్‌, రాము, మహబూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలు మానుకోవాలి

బెజ్జూరు: మంత్రిసీతక్క, కాంగ్రె స్‌ నాయకులపై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసత్య ఆరోపణలు మానుకోవాలని బ్లాక్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్‌ అన్నారు. గురు వారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనురాలు అయిన మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీతక్క పేరుచెప్పి నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నార నడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామ న్నారు. చిల్లర రాజకీయాలు మానుకోకుంటే తగినమూల్యం చెల్లిం చక తప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సిర్పూర్‌ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌పై అసత్య ఆరోప ణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్య క్రమంలో మండల అధ్యక్షుడు శంకర్‌, హకీం, కో ఆప్షన్‌ సభ్యుడు భషరత్‌ఖాన్‌, ఎంపీటీసీ వెంకన్న, కోండ్ర నరేందర్‌గౌడ్‌, మహేష్‌, సతీష్‌, షౌకత్‌అలీ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 10:58 PM