Kumaram Bheem Asifabad: ఏసీబీ వలలో జైనూరు తహసీల్దార్, కార్యదర్శి
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:12 PM
జైనూర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జైనూరు మండల తహసీల్దార్, గ్రామకార్యదర్శి శనివారం రూ.12వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
జైనూర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జైనూరు మండల తహసీల్దార్, గ్రామకార్యదర్శి శనివారం రూ.12వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి చెప్పిన వివరాల ప్రకారం.. జైనూరు మండలంలోని పోచంలొద్దిలో ఇటీవల రూ. 10లక్షల రూపాయల నిధులతో కాంట్రాక్టర్ కేంద్రె సుబోధ్ రోడ్డు నిర్మిం చాడు. ఇందుకు సంబంధించిన బిల్లు మంజూరు చేయడానికి సుబోధ్ ను జైనూర్ తహసీల్దార్ తిరుపతి, గ్రామకార్యదర్శి శేఖర్ 12వేల రూపా యలు డిమాండ్‌చేశారు. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో సుబోధ్ 12 వేల రూపాయలు తహసీల్దార్ తిరుపతి, గ్రామకార్యదర్శి శేఖర్‌కి ఇస్తుం డగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.