Kumaram Bheem Asifabad: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:52 PM
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల14న నుంచి జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారన్నా రు. గ్రంథయాలు విజ్ఞాన భాండాగారాలని అన్నారు. పుస్తకపఠనం ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చని పోటీపరీక్షలకు హాజరయ్యే వారికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రంథాలయంలో పాఠకుల కొరకు, పోటీపరీక్షల అభ్యర్థుల కొరకు అవసరమైన పుస్తకాలు, పత్రికలు, మెటీరియల్‌ను అందుబాటులో ఉంచామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని ఇటీవల జరిగిన డీఎస్సీ, గ్రూపు-4, పోలీసు ఉద్యోగాలలో దాదాపు 20మందివరకు ఉద్యోగాలు సాధించడం అభినం దనీయమన్నారు. అనంతరంవారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిత్ర లేఖనం, మ్యూజికల్‌చైర్, పుస్తకాలప్రదర్శన, వ్యాసరచన, కవిసమ్మే ళనం, పాటలపోటీలు, రంగోలిపోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయకార్యదర్శి సరిత, మున్సి పల్ కమిషనర్ భుజంగరావు, జిల్లాపరీక్షల అధికారి ఉదయ్‌బాబు, అదనపుగ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, గ్రంథాలయ అధికారులు సదానందం, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.