Share News

Kumaram Bheem Asifabad : మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 10:31 PM

దహెగాం, నవంబరు 13(ఆంద్రజ్యోతి): విద్యార్థులకు మెనూప్రకారం భోజనం వడ్డిం చాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశా లను సందర్శించి మెనూప్రకారం భోజనం అందించకపోవడంపై మండిపడ్డారు.

Kumaram Bheem Asifabad : మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

దహెగాం, నవంబరు 13(ఆంద్రజ్యోతి): విద్యార్థులకు మెనూప్రకారం భోజనం వడ్డిం చాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశా లను సందర్శించి మెనూప్రకారం భోజనం అందించకపోవడంపై మండిపడ్డారు. ఉపాధ్యా యులు, విద్యార్థుల హాజరురిజిస్టర్లను పరిశీలించి 80మంది విద్యార్థినులగైర్హాజరుపై మండిపడ్డారు. ఈమేరకు నివేదికలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యాలయం ఆవరణలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీకార్యదర్శిని ఆదేశించా రు. పాఠశాలలో ఆర్వోఆర్‌ ప్లాంటును పరిశీలించగా అదిచెడి పోయిందని ఉపాధ్యాయులు తెలపడంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. పాఠశాల ఆవరణలో బోరుబావినీటి షాంపిల్స్‌ను జిల్లా కేంద్రం లోని ల్యాబ్‌కుపంపించి పరీక్షలు నిర్వహించి నివేదిక లను కలెక్టర్‌కార్యాలయంలో అందజేయాలని ఆదేశిం చారు. అనంతరం బీబ్రా గ్రామంలో సమగ్రకుటుంబ సర్వేను పరిశీలించారు. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలను తప్పులు లేకుండా పూర్తి చేయాలన్నారు. సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లను ఆదేశించారు.

ధాన్యం రైతులకు మద్దతు ధర..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చెల్లిస్తామని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన వరిధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన కాగజ్‌నగర్‌ సబ్‌కలె క్టర్‌ శ్రద్ధాశుక్లాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తామన్నారు. క్వింటాలుకు గ్రేడ్‌-ఎ రకం రూ.2320, గ్రేడ్‌-బి రకానికి రూ.2300 చెల్లిస్తామన్నారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వంరూ.500బోనస్‌ ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగు నీరు, నీడ, గోనెసంచులు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. తేమ శాతం 17ఉంటే కొనుగోలు చేపట్టాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ కవిత, ఎంపీడీవో రాజేందర్‌, సీఈవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 10:31 PM