Kumaram Bheem Asifabad: నేడు ఎమ్మెల్యే హరీష్‌బాబు దీక్ష
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:50 PM
సిర్పూర్(టి), నవంబరు 3(ఆంద్రజ్యోతి): సిర్పూర్ (టి) అటవీశాఖకార్యాలయం ఎదుట సోమవారం నిరాహర దీక్షచేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.
సిర్పూర్(టి), నవంబరు 3(ఆంద్రజ్యోతి): సిర్పూర్ (టి) అటవీశాఖకార్యాలయం ఎదుట సోమవారం నిరాహర దీక్షచేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారంరోజుల క్రితం మండలంలోని బెంగాళీ క్యాంపునకు చెందిన ఏడుగురిపై అక్రమంగా కేసుపెట్టి చితకబాధిన అటవీశాఖ అధి కారుల తీరును నిరసిస్తూ నిరాహారదీక్ష చేపడు తున్నట్లు తెలిపారు. గతంలోసైతం అటవీశాఖ అధి కారులు వన్యప్రాణు లను చంపారన్న నెపంతో లక్షలు వసూలు చేసి కాగజ్‌నగర్ డీఎఫ్‌వోకు కట్టబెట్టారని ఆరోపించారు. అలాగే కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీశాఖకు మంజూరైన కంపా నిధులలో అటవీ అధికారులు లక్షలరూపాయల అవినీతికి పాల్ప డ్డారని అవికూడా బహిర్గతం చేయాలన్నారు. అటవీశాఖ అధికారులపై రాష్ట్ర, మంత్రి, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలుపెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయనవెంట నాయకులు శంకర్, సత్యనారాయణ, అశోక్, నాని, సాయి,ప్రశాంత్, వానుపటేల్, జావీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
కాగజ్‌నగర్: సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్‌లను ఆదివారం ఎమ్మెల్యేహరీష్‌బాబు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థికసహాయాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. సీఎం సహాయనిధికి అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలోలబ్ధిదారులు పాల్గొన్నారు.