Share News

Kumaram Bheem Asifabad: మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు విస్తరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:23 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు విస్త రించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad: మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు విస్తరించాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు విస్త రించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారితో కలిసి బీఎస్‌ఎన్‌ ఎల్‌, టీఫైబర్‌, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాలు, జిల్లా గ్రామీణఅభివృద్ధి, సివిల్‌సప్లైఅధికారులతో మొబైల్‌ఇంటర్నెల్‌ సేవల విస్తరణపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్నెట్‌ సేవలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీతో పాటు పెన్షన్‌పంపిణీ లాంటి పథకాలు ఆలస్యమ వుతున్నాయని అన్నారు. దీని నివారణకోసం జిల్లా లోని మారుమూల ప్రాంతాలకు మొబైల్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలు విస్తరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. టవర్‌లఏర్పాటు కోసం అటవీ శాఖ అనుమతితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ తీర్మాణాలు, ఆర్వోఎఫ్‌ఆర్‌ అనుమతు లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లాలోని తిర్యాణి, బెజ్జూరు, దహెగాం, లింగాపూర్‌ మండలాల్లో కొన్నిటవర్ల నిర్మాణం పూరైందని వాటికి వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు.

పాఠకులకు పూర్తిసౌకర్యాలు కల్పించాలి..

జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు పూర్తిసౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకేంద్ర గ్రంథాలయలో పాఠకులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. భవనానికి విద్యుత్‌, శానిటేషన్‌ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రంథా లయం పరిధిలోని అన్నికెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి తెలిపారు. గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని, ఆర్వో ప్లాంట్‌ ద్వారా పాఠకులకు శుద్ధ జలాన్ని అందించాలని తెలిపారు. ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గ్రంథాలయంలో పాఠకులకు, పోటీపరీక్షలకు సంబంధించిన అభ్యర్థులకు అవసరమైన పత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉంచాల న్నారు. డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాద నలు సమర్పించాల న్నారు. ఆయనవెంట గ్రంథాలయాధికారి సదానందం, టీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:23 PM