Share News

Kumaram Bheem Asifabad: సర్వేలో నోడల్‌ అధికారులది కీలకపాత్ర: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 09 , 2024 | 10:52 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా శనివారం నుంచి ప్రారంభమైన ప్రశ్నావలి సేకరణ పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

 Kumaram Bheem Asifabad:  సర్వేలో నోడల్‌ అధికారులది కీలకపాత్ర: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా శనివారం నుంచి ప్రారంభమైన ప్రశ్నావలి సేకరణ పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన వివిధశాఖల అధికారులు, నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభమయ్యే ప్రశ్నావళి సేకరణలో నోడల్‌అధికారులు ప్రముఖపాత్ర పోషించాలన్నారు. సూపర్‌వైజర్లపై, ఎన్యూమరేటర్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. రోజువారీగా పూర్తిచేసే వివరాలను సాయంత్రం 6లోపు అందజేయాలన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే దానిని సవరించేలా పనిచేయాలని కప్పి పుచ్చేలా పని చేయకూడదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్వే జిల్లాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత నోడల్‌ అధికారులపై ఉందన్నారు. ఎన్యుమరేటర్లు రోజుసర్వేకు సంబంధించిన పేపర్లు ప్రతి రోజు ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేపట్ల ప్రజల్లో ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా చేపట్టాలని కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా తెలిపారు. శనివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలువార్డుల్లో సర్వే చేపడుతున్న సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కిరణ్‌, కమిషనర్‌ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని వార్డునెం.15లో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేతీరును కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేలక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత ఎన్యురేటర్లపై ఉంటుందన్నారు. నిర్దేశించిన ఫారంలో ఇచ్చిన ప్రతిఅంశాన్ని ప్రజల నుంచి సేకరించాలని సూచించారు. అందుబాటులో లేని వారి దగ్గరికి మరోసారి వెళ్లాలన్నారు.ఏ ఇంటిని కూడా వదిలి పెట్టకూడదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భుజంగరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 10:52 PM