Share News

Kumaram Bheem Asifabad: ఇటిక్యాలపహాడ్‌ గ్రామాన్ని సందర్శించిన పీసీసీఎఫ్‌

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:05 PM

సిర్పూర్‌(టి), డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇటిక్యాలపహాడ్‌ గ్రామాన్ని తెలం గాణ పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ఫారెస్ట్‌) చీఫ్‌ సువర్ణ బుధవారం సందర్శిం చారు.

Kumaram Bheem Asifabad:  ఇటిక్యాలపహాడ్‌ గ్రామాన్ని సందర్శించిన పీసీసీఎఫ్‌

సిర్పూర్‌(టి), డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇటిక్యాలపహాడ్‌ గ్రామాన్ని తెలం గాణ పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ఫారెస్ట్‌) చీఫ్‌ సువర్ణ బుధవారం సందర్శిం చారు. అటవీప్రాంతంలో కంపా (కంపెన్సేటరీ అఫోరెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ)నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని ఎకరాల్లో, ఎంత విస్తీర్ణంలో మొక్కలను పెంచారని ఎఫ్‌ఆర్వో ఎక్బాల్‌ హుస్సేన్‌ను అడిగితెలుసుకు న్నారు. మ్యాప్‌ద్వారా పులుల కారిడార్‌, తడోబా రహదారులను వివరించారు. కాగ జ్‌నగర్‌ డివిజన్‌లో ఇటీవల పులిదాడిలో మృతిచెందిన లక్ష్మితోపాటు సిర్పూర్‌(టి)కిచెందిన రౌతుసురేష్‌, మహా రాష్ట్రలోని అమృత్‌గూడలో లాలుబాయి మృతిచెందగా సంఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఇటిక్యాల పహాడ్‌ గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీచేశారు. ఆమెవెంట ఎఫ్‌డీడీటీ శాంతారాం, ఎఫ్‌డీవో నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌, ఎఫ్‌డీవో వినయ్‌ కుమార్‌సాహు, ఎఫ్‌ఆర్వో ఎక్బాల్‌హుస్సేన్‌, డిప్యూటీరేంజ్‌ అధికారి శ్రీధర్‌, ఎఫ్‌ఎస్‌ వో మోహన్‌, నరేష్‌, తదితరులు ఉన్నా.రు.

Updated Date - Dec 26 , 2024 | 11:05 PM