Share News

Kumaram Bheem Asifabad : కవులు సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయాలి

ABN , Publish Date - Nov 17 , 2024 | 10:28 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కవులు సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌ మిర్యాల ఉదయ్‌బాబు అన్నారు.

Kumaram Bheem Asifabad :  కవులు సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయాలి

ఆసిఫాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కవులు సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌ మిర్యాల ఉదయ్‌బాబు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో 57వగ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి ధర్మపురి వెంకటేశ్వర్లు రచించిన వసుధా శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు తమ కవితలు, రచనలు ముందు తరాలకు ఆదర్శంగా ఉండే విధంగా రచించాలని సూచించారు. మంచి రచనలు రచించిన కవులు పాఠకుల మదిలో చిరస్థాయిగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కవులు రమేష్‌, సత్య నారాయణ, నారాయణమూర్తి, రేవితి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, రాజయ్య, రాధాకృష్ణచారి, శ్రీనివాస్‌, రాజయ్య, ఇషాక్‌, శ్రీదేవి, సవిత పెంటయ్య, శీలత, చరణ్‌సాకేత్‌, సాయివివేక్‌, అమర్‌బీన్‌ హైమద్‌, సిబ్బంది సదానందం, ప్రవీణ్‌, స్వర్ణలత, సతిదేవి, వెంకటరమణ, సలీం, రామయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 10:28 PM