Share News

Kumaram Bheem Asifabad: ఎన్నికల హోరు.. క్రికెట్‌ జోరు

ABN , Publish Date - Mar 30 , 2024 | 10:25 PM

బెజ్జూరు, మార్చి 30: సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో రాజకీయ హోరు కొనసాగుతోంది. దీనికి క్రికెట్‌ జోరు జతకానుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)క్రికెట్‌ సమరం శుక్రవారం మొదలైంది. దేశంలో ఎక్కువ మంది ఆదరించే క్రికెట్‌ పోటీలు ఒకవైపు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మరోవైపు కొనసాగుతుండటంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంది.

 Kumaram Bheem Asifabad:   ఎన్నికల హోరు.. క్రికెట్‌ జోరు

- జిల్లాలో వ్యసనంగా మారిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

- ఈజీ మనీ కోసం యువకుల ఆరాటం

- ప్రతీ సంవత్సరం రూ.లక్షల్లో బెట్టింగ్‌

- వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే

- గ్రామాల్లో కూడా ఆగని బెట్టింగ్‌

బెజ్జూరు, మార్చి 30: సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో రాజకీయ హోరు కొనసాగుతోంది. దీనికి క్రికెట్‌ జోరు జతకానుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)క్రికెట్‌ సమరం శుక్రవారం మొదలైంది. దేశంలో ఎక్కువ మంది ఆదరించే క్రికెట్‌ పోటీలు ఒకవైపు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మరోవైపు కొనసాగుతుండటంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంది. గతంలో జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు బానిసై ఎంతోమంది యువత ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. క్రికెట్‌ క్రీడ అంటేనే చిన్నారుల నుంచి యువకుల వరకు ఎంతో క్రేజ్‌. గతంలో క్రికెట్‌ చూస్తూ ఆటగాళ్లను అనుకరిస్తూ మైదానంలో క్రికెట్‌ ఆడే యువత ఇప్పుడు కొత్త పంథాను మార్చుకుంది. మైదా నంలో ఆడాల్సిన క్రికెట్‌కు పుల్‌స్టాఫ్‌ పెట్టేసి అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో లేదంటే టీవీల ముందు చేరి బెట్టింగ్‌ అనే మహమ్మారిని తమ జీవీతంలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో అటు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగానే కాకుండా తల్లిదండ్రులను సైతం క్ష్యోభకు గురి చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ వచ్చిందంటే చాలు క్రికెట్‌ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తోంది ఐపీఎల్‌. ఈ ఐపీఎల్‌ క్రికెట్‌ ద్వారా యువత పెడదోవ పడుతోంది. ఈజీగా మనీ సంపాదనే ధ్యేయంగా బెట్టింగ్‌వైపు అడుగులేస్తూ జేబులను గుల్ల చేసుకుంటున్నారు. గతంలో ముఖ్యమైన పట్టణాల్లోనే పరిమితమైన ఈ వికృతక్రీడ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. మ్యాచ్‌ జరిగే సమయంలో యువత చేతిలో డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చిన ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్‌ లేదా బంగారు గొలుసులను తాకట్టు పెట్టి బెట్టింగ్‌ చేస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పట్టణాలతోపాటు వివిధ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఇదే తంతు నడుస్తోంది. తాను కట్టిన జట్టు, ప్లేయర్‌ గెలవాలనే ఆకాంక్షతో చదువు లను సైతం పక్కన పెట్టి టీవీలను లేదంటే సెల్‌ఫోన్‌లకు అతుక్కుంటున్నారు. తీరా ఆ ప్లేయర్‌ గెలవకపోతే ఒత్తిడికి గురవుతున్నారు. అప్పు చేసి బెట్టింగ్‌లు పెట్టి ఒకవేళ డబ్బులను పోగొట్టుకుంటే వాటిని ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. కొంతమంది గతంలో ఆత్మహ త్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుండటంతో విషయం బయటకు పొక్కడం లేదు. ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని అడ్డుకుందామని పోలీసులు యత్నిస్తున్నా చిన్న సాక్ష్యం కూడా దొరకడం లేదు. ఏ పది మంది యువకులు కలిసినా ఐపీఎల్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తప్ప వేరే విషయాలు చర్చించకపోవడం గమనార్హం.

బెట్టింగ్‌ అంతా ఫోన్‌లోనే..

జిల్లాలో పలుచోట్ల మండల కేంద్రాల్లో ఈ తరహా దందా ఎక్కువగా సాగుతోందని సమాచారం. బెట్టింగ్‌ రాయుళ్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు, రిజిస్టర్లు మెయింట నెన్స్‌ చేస్తున్నారంటే ఏ తరహాలో దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒంటిపూట బడులు ఉండటంతో మధ్యాహ్నం, రాత్రి వేళలో ఏ ఆటగాడిపై ఎవరు ఎంత చెల్లిస్తారు.. వారు అనుకున్న విధంగా ఆ ఆటగాడు ఆడి టార్గెట్‌కు అయితే ఆ డబ్బులను ఏ విధంగా తీసుకోవాలనే దానిపై చర్చలకు ప్రత్యేక సమావేశాలు సాగిస్తున్నారు. లేదంటే సెల్‌ఫోన్‌లతో చర్చ లకు దిగి ఏ ఆటగాడిపై ఎంత పెడుతున్నారనే విషయా లను స్పష్టం చేసుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా రిజిస్టర్‌ ఏర్పాటు చేసి అందులో ముందుగానే యువకులు తమ పేర్లను నమోదు చేసుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతూ, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞాణం పెరుగు తున్న కొద్దీ బెట్టింగ్‌ రాయుళ్లు తమ పంథా మార్చుకుంటున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అంతా బెట్టింగ్‌ సెల్‌పోన్‌లోనే కొనసాగుతోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతుండటంతో వీటిపై బెట్టింగ్‌ జోరుగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు డిపాజిట్‌ దక్కుతుందా లేదా అని అభ్యర్థులపై బెట్టింగ్‌ జరగనుందని.. మరోవైపు ఐపీఎల్‌లో ఏ బాల్‌కు ఎన్ని పరుగులు చేస్తారు.. ఎవరి వికెట్‌ ఎవరు తీస్తారు.. ఇలా రకరకాల అంశాలపై పందెం కాస్తారనే అంచనాలున్నాయి.

రేటింగ్సే బెట్టింగ్‌కు ఆధారం..

మ్చాచ్‌లో పాల్గొంటున్న జట్లకు రేటింగ్స్‌ బలాబలాలను బుకీలు ఇస్తున్నారు. బలంగా ఉన్న జట్టుకు తక్కువ రేటింగ్‌ బలహీన జట్టుకు ఎక్కువ రేటింగ్‌ ఇస్తూ యువత జీవితాలతో బుకీలు ఆటలు ఆడుకుంటున్నారు. బెట్టింగ్‌లో కోల్పోయిన వస్తువులను వెనక్కి తీసుకురాలేక, ఇంట్లో నిజాన్ని చెప్పలేక మనోవ్యథ అనుభవిస్తున్నారు. ప్రతీ ఐపీఎల్‌ క్రీడల్లో కొందరు ఉన్నదంతా పోగొట్టుకుంటూ మరి కొందరు లక్షలు సంపాదిస్తున్నారు. బెట్టింగ్‌లపై పోలీసులు నజర్‌ పెట్టినా వారికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించు కుంటున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బెట్టింగ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిజిటల్‌ సేవలను మంచి పనులకు ఉప యోగించుకోవాల్సింది పోయి చెడు మార్గానికి విని యోగించుకునేందుకు యువత మొగ్గు చూపుతోంది. మ్యాచ్‌కు సంబంధించి వ్యవహారమంతా వాట్సాప్‌, హైక్‌, మెసెంజర్ల రూపంలో ఆన్‌లైన్‌లో సాగుతోంది. మ్యాచ్‌ ప్రారంభమైన 20నిమిషాల ముందే ఆయా జట్ల బలా బలాలపై బెట్టింగ్‌ కాస్తున్నారు. పందెంలో గెలిచినా ఓడినా డబ్బు ఆన్‌లైన్‌లోనే బదిలీ అవుతుంది. ఈ వ్యవహార మంతా గుట్టుచప్పుడు కాకుండా ఎవ్వరికి తెలియకుండా కొనసాగుతోంది. పోలీసులు దీనిపై పటిష్ట నిఘా పెట్టి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Mar 30 , 2024 | 10:36 PM