Share News

Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:11 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరి ష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అద నపుకలెక్టర్‌ ఎం డేవిడ్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:  ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

- అదనపు కలెక్టర్‌ ఎం డేవిడ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరి ష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అద నపుకలెక్టర్‌ ఎం డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో ఆసిఫాబాద్‌ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతోకలిసి అర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్‌ మండలం వావుదాం గ్రామంలో గిరిజనప్రాథమిక పాఠ శాల భవనంలేక తరగతులు గ్రామపంచాయతీ కార్యాల యంలో కొనసాగించాల్సి వస్తోందని శాశ్వత పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు, విద్యార్థులు దరఖా స్తులు అందజేశారు. వాంకిడి మండలంలోని పాట గూడ పంచాయతీపరిధిలో గల ఎనాలి, కొలాంగూడ గ్రామాలకు మిషన్‌భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని గ్రామస్థులు దరఖాస్తు చేశారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మహిళా ఉపాధి హామీ కూలీలు తమకు ఉపాధిహామీ పనులు కల్పించాలని దరఖాస్తు అందజేశారు. బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన యశోద తనకు ఒంటరి మహిళా పింఛన్‌ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడిమండలం లెండిగూడ గ్రామానికిచెందిన శ్యాంరావు తనకూతు రుకు మతిస్థిమితం లేదని ఆసరాపెన్షన్‌ ఇప్పించాలని, రెబ్బెన మండలం గోలేటికి చెందిన గోలేటి రిజర్వాయర్‌ ఎడమకాలువ ఆయకట్టు రైతులు ఎమడ కాలువకు గండిపడినందున వెంటనే మరమ్మతులు చేయించి నీరుఅందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్‌ మండ లం కోసిని గ్రామపరిధిలోని పర్ధాన్‌గూడకుచెందిన విజయ్‌ తనకు ఉపాధికల్పించాలని అర్జీసమర్పించారు. ఆసిఫాబాద్‌పట్టణంలోని బజార్‌ వాడీ గ్రామానికిచెందిన ప్రమీల తనకు ఇందిరమ్మఇల్లు, గృహజ్యోతి పథకం వర్తించేలా చేయాలని దరఖాస్తు అందజేశారు. వాంకిడి మండ లం మహగాం గ్రామానికిచెందిన చిన్నమారు తాను సంవత్సరాలుగా ప్రభుత్వభూమిలో సాగుచేసుకుంటున్నాని తనకు నూతనపాసు పుస్తకం ఇప్పించాలని, సిర్పూర్‌(టి)మండలం పారిగాం గ్రామానికి చెందిన రావూజీవృద్ధాప్యపెన్షన్‌ మంజూరుచేయాలని దరఖాస్తు అందజేశారు.

Updated Date - Dec 30 , 2024 | 11:11 PM