Share News

Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:42 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజ వాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదేశించారు.

Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజ వాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్‌లో అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారి, డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వ ర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీక రించారు. చింతలమానేపల్లి మండలం బాలాజీఅనుకోడ గ్రామానికి చెందిన జగ్గయ్య తనకు వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లికి చెందిన పీతాంబర్‌ తన తల్లిపేరిట ఉన్న పట్టాభూమిని ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని దర ఖాస్తు అందజేశారు. తిర్యాణిమండలం రొంపల్లికి చెందిన కొలాం గిరిజనులు తమకు ఇంటిస్థలాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్‌ మండ లం రాజురా గ్రామానికి చెందిన బుచ్చయ్య తనకు రుణ మాఫీ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. లింగా పూర్‌కు చెందిన మనీషా తనకు ఉన్నత చదువుల కొరకు ల్యాప్‌టాప్‌ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. తిర్యా ణి మండలం నాయకపుగూడ గ్రామానికి చెందిన లక్ష్మి తనభర్త పేరిట ఏదులపాడ్‌ శివారులో ఉన్న పట్టా భూమిని ఇతరులు అక్రమంగా తమపేరిట మార్చుకు న్నారని దానిని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని దరఖాస్తు అందజేశారు. జైనూరు మండలం జన్సుగూడ గ్రామానికిచెందిన అనసూయబాయి తనకు ఆసరా పెన్ష న్‌ ఇప్పించాలని అర్జీ సమర్పించారు. చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి గ్రామానికి చెందిన లావణ్య తాను పదవ తరగతి చదువు తున్నానని చెవిటి, మూగ వైక ల్యం కలిగిఉన్నానని తన సదరం ధ్రువపత్రాన్ని పున రుద్దరించాలని దరఖాస్తు అందజేశారు.

కాగజ్‌నగర్‌: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణిలో దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. వివిధశాఖల్లో పెండింగ్‌లోఉన్న పనులను పూర్తిచేయాలన్నారు. సోమవారం నిర్వ హించిన ప్రజావాణిలో 13దరఖాస్తులు వచ్చినట్టు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:42 PM