Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:26 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 23(ఆంధ్ర జ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖా స్తులను క్షేత్రస్థాయిలో త్వరగా పరిష్క రించే విధంగా అధికారులు సమన్వ యంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, డిసెంబరు 23(ఆంధ్ర జ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖా స్తులను క్షేత్రస్థాయిలో త్వరగా పరిష్క రించే విధంగా అధికారులు సమన్వ యంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదా రుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దహెగాం మండలానికి చెందిన చంద్ర య్య మండలంలో అనర్హులకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేశారని, ఈ విషయంలో విచారణజరిపి చర్యలు తీసుకోవాలని దర ఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం వంకు లం గ్రామస్థులు రాళ్లపేట గ్రామ పంచాయ తీని విడదీసి నూతన పంచాయతీగా ఏర్పాటు చేయాలని అర్జీ సమర్పించారు. పెంచికలపేట మండలం గుండెపల్లి గ్రామస్థులు వందశాతం గిరిజనులు నివసిస్తున్నందున కమ్మర్‌గాంను గ్రామపంచాయతీ నుంచి తొలగించి నూతన పంచాయతీగా ఏర్పాటు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధి లోని జన్కాపూర్‌కుచెందిన కార్తీక్ ఇంటి నిర్మాణం కొరకు మున్సిపల్ అనుమతి ఇప్పిం చాలని అర్జీసమర్పించారు. కాగజ్‌నగర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన కవిత మండల్ తనపేరిటఉన్న పట్టాభూమిలో అయిదుగుంటల భూమిని తొలగించి నందున సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజే శారు. చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లికి చెందిన శ్యాంరావు తన పేరిట పట్టా భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తు న్నారని వారిపైచర్యలు తీసుకవాలని కోరారు. రాజం పేట గ్రామానికి చెందిన పద్మ తనకు వితంతు పెన్షన్ ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన అబిద్‌ఖాన్ సదరం శిబిరం కొరకు స్లాట్ బుకింగ్ కానందున బుక్కింగ్ అయ్యేలా చూడాలని, కెరమెరి మండలం సుర్దాపూర్‌కు చెందిన నాందేవ్ దివ్యాంగ సర్టిఫికేట్ ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలన్నారు.
కాగజ్‌నగర్: ప్రజావాణిలో ప్రజలనుంచి వచ్చిన సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా వాణిలో వచ్చిన అర్జీలను ఎప్పకటిప్పుడు క్లియర్ చేయాలన్నారు. ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.