Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరిస్తాం
ABN , Publish Date - Nov 04 , 2024 | 10:50 PM
ఆసిఫాబాద్, నవంబరు 4(ఆంద్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 4(ఆంద్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖా స్తులను స్వీకరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన రైతులు రవి, విలాస్, ప్రణయ్, శ్రీకాంత్, నరేష్ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరారు. లింగాపూర్ మండలం పిట్టగూడకు చెందిన ధర్మాబాయి తన భర్త పేరిట ఆర్వోఆర్ పట్టాభూమి ఉందని, ఆయన మరణించారని, పట్టాభూమిని తనపేరిట మార్చాలని దరఖాస్తు చేసుకు న్నారు. సిర్పూర్(టి)మండలం చీలపల్లికి చెందిన యాద గిరిగోపాల్ తనకు దివ్యాంగపెన్షన్ ఇప్పించాలని, తిర్యాణి మండలం చింతపల్లికిచెందిన లక్ష్మి తనకు వితంతు పెన్షన్ ఇప్పించాలని, కాగజ్‌నగర్ మండలం గన్నా రంకు చెందిన వెంటకమ్మ తనభర్త పేరిట పట్టాభూమి ఉందని ఆయన మరణించారని, తన పేరిట మార్పు చేయాలని దరఖాస్తు అందజేశారు. జైనూరుమండలం కిషన్ నాయక్ తండాకు ఎందిన పవర్ వసంత్‌రావు తనకు రైతు రుణమాఫీ చేయాలని, రెబ్బెన మండలం తుంగె డకు చెందిన శివరాం బైండోవర్ కేసునుంచి తనపేరు తొలగించాలని దరఖాస్తుఅందజేశారు.తిర్యాణి మండలం ఉల్లిపిట్ట, డోర్లి గ్రామానికి ఎందిన అనుష్క డిగ్రీకళాశాల నుంచి తనటీసీ, మెమోఇప్పించాలనిఅర్జీ సమర్పించారు.
కాగజ్‌నగర్: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి ఫిర్యాదు కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.