Share News

Kumaram Bheem Asifabad : రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:58 PM

పెంచికలపేట, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

Kumaram Bheem Asifabad :  రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

పెంచికలపేట, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శనివారం మండలంలోని గుంట్లపేట, ఎల్క పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రా లను సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ దలారులను నమ్మి మోసపోకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏగ్రేడ్‌ రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2300అదే విధంగా సన్నరకంకు అదనంగా రూ.500చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ట్యాబ్‌లో వెంటనే నమోదు చేయాలని సూచించారు. తేమ శాతం 17 కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండడానికి కారణమేమిటని ఎస్‌వో కవితను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇళ్లలోకి వెళ్లారని ఆమె బదులిచ్చారు.

వంటగది, డైనింగ్‌ హాల్‌, స్టోర్‌ రూంలను పరిశీలించారు. స్టోర్‌రూంలో కొన్ని కూరగాయలు చెడిపోయి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూప్రకారం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, ఎస్సై కొమురయ్య, ఆర్‌ఐ గోపాల్‌, తదితరులున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 09:58 PM