Kumaram Bheem Asifabad: రైస్ మిల్లర్లు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Nov 04 , 2024 | 10:46 PM
ఆసిఫాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు.
-అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానా కాలం ధాన్యం కొనుగోలు, అండర్ టేకింగ్, బ్యాంక్ గ్యారంటీ, బియ్యం మిల్లింగ్ అంశాలపై చర్చించారు. ఈనెల 15తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ధాన్యం మిల్లింగ్ చార్జీలు ఒక క్వింటాలు దొడ్డు రకం ధాన్యానికి 40రూపాయిలు, సన్నరకం ధాన్యానికి రూ.50 చొప్పున చెల్లిస్తామన్నారు. నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు, ఆయాశాఖల అధికారులు, రైస్ మిల్లు యాజమానులు పాల్గొన్నారు.